1 00:00:13,055 --> 00:00:15,807 హే, గ్రేస్ ని మాట్లాడుతున్నాను. మెసేజ్ ఇవ్వండి. 2 00:00:16,808 --> 00:00:20,312 గ్రేస్, హలో. నేను జిమ్మీని. మళ్లీ. కానీ నీకది తెలుసు కదా? 3 00:00:20,312 --> 00:00:22,314 అందుకేగా వాయిస్ మెయిల్ ఇవ్వాల్సివచ్చేలా చేశావు. 4 00:00:22,314 --> 00:00:25,108 నాకు కాల్ చెయ్యి, సరేనా? ఉంటాను. 5 00:00:28,695 --> 00:00:29,738 హే, డెరెక్. 6 00:00:30,781 --> 00:00:31,782 శుభోదయం, జిమ్మీ. 7 00:00:33,659 --> 00:00:34,660 ఏం చేస్తున్నావు? 8 00:00:35,244 --> 00:00:39,790 లిజ్ బాత్రూమ్ ఆకట్టుకుంటుంది ఒకోసారి పొద్దున్నే. అందుకే ఇక్కడ కానిస్తుంటాను. 9 00:00:39,790 --> 00:00:42,584 ఉదయానే వర్షంలో కానివ్వటం అంటే బానే ఉంటుంది. 10 00:00:43,168 --> 00:00:44,461 చాలా బాగుంటుంది. 11 00:00:45,128 --> 00:00:46,922 గాలి తూర్పు వైపు నుంచి వీస్తున్నట్టుంది. 12 00:00:48,131 --> 00:00:50,342 నువ్వు ఆ కార్న్ హోల్ బార్ కి వెళ్ళావని విన్నాను. 13 00:00:50,843 --> 00:00:52,219 అదిరిపోయిందా? -బానే ఉంది. 14 00:00:52,219 --> 00:00:54,805 తాగటానికి మందు ఉంది, తినటానికి తిండి ఒక మాదిరిగా ఉంది. 15 00:00:55,305 --> 00:00:58,976 రెండు కార్న్ హోల్ స్టేషన్లు ఉన్నాయి. -రెండా? అద్భుతం. 16 00:01:00,060 --> 00:01:01,979 డెరెక్, మళ్లీ అక్కడ పోసుకుంటున్నావా? 17 00:01:01,979 --> 00:01:04,690 లేదు, ఊరికే జిమ్మీతో మాట్లాడుతున్నాను, అంతే. 18 00:01:05,440 --> 00:01:06,608 అలా కన్నుకొడితే ఏదోలా ఉంది. 19 00:01:06,608 --> 00:01:08,360 అదంతా నీ చూపులో ఉంది, జిమ్మీ. 20 00:01:11,071 --> 00:01:12,531 నాపై కోపంగా ఉన్నట్టు అనిపించాడా? 21 00:01:12,531 --> 00:01:14,157 లేదు. అంతా బానే ఉంది. 22 00:01:14,157 --> 00:01:17,578 సరే. ఇక పూవుల మీద పోయటం ఆపు. 23 00:01:17,578 --> 00:01:19,621 కాస్తే పోశాను. -అబ్బా, ఆపు. 24 00:01:19,621 --> 00:01:20,706 కొద్దిగానే. 25 00:01:20,706 --> 00:01:23,959 క్షమాపణ కోరుతూ ఈ బేగల్స్ తెచ్చాను. నీపై పెత్తనం చేయటం నా ఉద్దేశం కాదు. 26 00:01:23,959 --> 00:01:26,712 పాల్ ఎదురైనప్పుడు, తనకి షాన్ మీ ఇంట్లో దిగినట్టు ఇదివరకే తెలుసనుకున్నాను. 27 00:01:26,712 --> 00:01:28,589 అవును. నా కొంప ముంచావు. 28 00:01:28,589 --> 00:01:30,632 పర్వాలేదు, కానీ కొంప మాత్రం ముంచావు. 29 00:01:30,632 --> 00:01:33,385 పర్వాలేదు, కానీ కొంప ముంచటం మాత్రం నిజం. 30 00:01:33,385 --> 00:01:34,511 క్షమించు. 31 00:01:34,511 --> 00:01:37,097 ఎవరికైనా అన్యాయంగా నావల్ల ఇబ్బంది కలిగించటం నాకిష్టం లేదు. 32 00:01:37,681 --> 00:01:40,350 ఎవరికైనా న్యాయంగా ఇబ్బంది కలగాల్సి ఉంటుందా? -ఆ విషయం నాకిష్టమైనది. 33 00:01:40,350 --> 00:01:43,395 నిజానికి ఏం పర్వాలేదులే. పాల్ ఎక్కువ కాలం నాపై కోపంగా ఉండడు. పర్లేదు. 34 00:01:43,395 --> 00:01:47,107 మంచిది. ఉంటాను. -అలాగే. కానీ నువ్వు నా కొంప ముంచావు! 35 00:01:47,107 --> 00:01:48,192 అర్థమయ్యింది. 36 00:01:50,110 --> 00:01:51,778 అవును. నిన్ను కలవటం నాకు చాలా ఆనందం. 37 00:01:52,279 --> 00:01:54,907 ఆఫీసుకి రా, ఇక్కడ నుండి అపార్ట్మెంట్ కి వెళ్దాము. 38 00:01:55,407 --> 00:01:58,577 సరే. ఉంటాను. బై బంగారం. 39 00:01:59,536 --> 00:02:01,914 అబ్బో. ఎవరో ఆ బంగారం? కత్తిలా ఉంటుందా? 40 00:02:01,914 --> 00:02:03,290 నా కూతురు. 41 00:02:03,832 --> 00:02:04,833 పొరపాటయ్యింది. 42 00:02:04,833 --> 00:02:08,086 హే, తను సింగిలా? ఎందుకంటే, విడాకులు అయ్యాక, 43 00:02:08,086 --> 00:02:11,048 కొత్తకొత్త ప్రయోగాలు చేయాలి అనిపిస్తోంది. 44 00:02:12,132 --> 00:02:13,926 ఊరికే అన్నానులే. నిన్ను విసిగిద్దామని అలా అన్నాను. 45 00:02:14,510 --> 00:02:17,012 అందులో నువ్వు సిద్ధహస్తురాలివి. -థాంక్యూ. ఇక కార్ ఎక్కు. 46 00:02:17,596 --> 00:02:19,181 నాకిష్టమైన పాట పెట్టచ్చా? 47 00:03:17,823 --> 00:03:18,657 ఎక్కడ మొదలుపెడదాం? 48 00:03:18,657 --> 00:03:21,535 ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా? ఇక్కడ వరకు రావటం ఎందుకు? 49 00:03:21,535 --> 00:03:22,619 షాన్, 50 00:03:24,162 --> 00:03:25,414 నా నోట్ బుక్ ఇక్కడుంది. 51 00:03:57,279 --> 00:03:59,531 నాతో ఉంటున్నావని మీ అమ్మానాన్నలకు చెప్పావా? 52 00:03:59,531 --> 00:04:02,409 లేదు. నేను ఒక థెరపిస్ట్ ఇంట్లో ఉంటున్నానని తెలిస్తే విడ్డూరంగా భావిస్తారు. 53 00:04:02,409 --> 00:04:04,494 అవును, అది విడ్డూరమైన విషయమే. నేనూ ఒప్పుకుంటాను. 54 00:04:04,494 --> 00:04:09,082 నిజం చెప్పాలంటే, నీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. 55 00:04:10,876 --> 00:04:12,794 దాని గురించి మాట్లాడుకుందామా? -వద్దు. 56 00:04:12,794 --> 00:04:16,255 దాన్ని ఒక ప్రశ్నగా అడగటం నా పొరపాటే. 57 00:04:16,255 --> 00:04:19,051 తిన్నగా అనేస్తాను. మాట్లాడుకుందాం. 58 00:04:20,177 --> 00:04:23,430 షాన్, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రోజుల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. 59 00:04:24,056 --> 00:04:27,142 అబద్ధం ఎందుకు చెప్పాలి? జిమ్మీ, ఈమధ్య చాలా సంతోషంగా ఉంటున్నాను. 60 00:04:27,643 --> 00:04:29,770 ఇప్పుడు దాన్ని చెడగొట్టుకోవటం ఎందుకు చెప్పు? 61 00:04:29,770 --> 00:04:33,148 అదే నా పని బాబూ. చెడగొట్టటంలో పట్టా కూడా పొందాను. 62 00:04:34,441 --> 00:04:37,194 పక్కవారి విషయంలో తలదూర్చే విశ్వవిద్యాలయం నుంచి. 63 00:04:37,945 --> 00:04:40,614 నిజానికి ఒక జూనియర్ కాలేజ్ నుంచే. ఇక ఆపేస్తాను. 64 00:04:40,614 --> 00:04:43,200 ఇలా చూడు, శాశ్వతంగా నిజానికి దూరంగా పారిపోవటం అసాధ్యం. 65 00:04:44,201 --> 00:04:45,410 అప్పుడే కాదు. 66 00:04:47,412 --> 00:04:48,413 సరే. 67 00:04:48,956 --> 00:04:53,043 థాంక్యూ. -ఎప్పటికైనా మాట్లాడుకుందాం. తొందర లేదు. 68 00:04:54,628 --> 00:04:55,796 ఇంట్లో కలుద్దామోయ్. 69 00:04:57,673 --> 00:05:01,009 హాయ్, నేను గ్యాబీని. ఇక్కడ థెరపిస్ట్ ని. 70 00:05:01,009 --> 00:05:02,803 అసలు నువ్వు నా దగ్గరకి రావలసి ఉన్నావు. 71 00:05:02,803 --> 00:05:05,305 నేనే జిమ్మీకి నిన్ను రిఫర్ చేశాను. 72 00:05:06,265 --> 00:05:07,933 సరే. -సరే. 73 00:05:09,768 --> 00:05:11,270 ఎలా గడుస్తోంది? 74 00:05:11,270 --> 00:05:14,064 బాగుంది. మొదట్లో ఈ థెరపిస్ట్ గోల ఏమీ నచ్చలేదు. 75 00:05:14,064 --> 00:05:16,108 కానీ, ఇప్పుడు నచ్చుతోంది. 76 00:05:16,108 --> 00:05:17,734 సంతోషం. 77 00:05:17,734 --> 00:05:19,736 ఇంతకీ నన్ను తన మీదకి తోసేయటం ఎలా జరిగింది? 78 00:05:19,736 --> 00:05:23,782 నిజం చెప్పాలంటే, మీరిద్దరూ ఒకరికి ఒకరు సరిగ్గా సరిపోతారు అనిపించింది. 79 00:05:23,782 --> 00:05:26,118 ఒకరికి ఒకరు సాయం చేసుకోగలరు అని కూడా అనిపించింది. 80 00:05:26,869 --> 00:05:30,539 అవును. డబ్బున్న తెల్లజాతి నడి వయస్కుడికి సాయం చేయాలని ఎప్పటినుంచో ఉండేది. 81 00:05:30,539 --> 00:05:32,374 సాయం చేయటం ఎప్పుడూ బాగుంటుంది. కనుక... 82 00:05:35,919 --> 00:05:39,006 హే, శుభోదయం. నువ్వు ఆలుగడ్డలు నచ్చే పిల్లవేనా? 83 00:05:39,006 --> 00:05:42,676 లేదు, పాల్. ఆలుగడ్డల్ని ఇష్టపడే బలమైన నల్లజాతి స్త్రీని. 84 00:05:42,676 --> 00:05:43,760 ఏంటి విషయం? 85 00:05:43,760 --> 00:05:47,097 నాకు పొలం నుంచి బోలెడన్ని ఆలుగడ్డలు వచ్చాయి. 86 00:05:47,097 --> 00:05:49,474 ఈమధ్య కూరగాయలు ఆఫీసుకి డెలివర్ అవుతున్నాయా? 87 00:05:49,975 --> 00:05:51,226 నాకు చాలా సందేహాలున్నాయి. 88 00:05:51,226 --> 00:05:54,605 నువ్వు రహస్య వంటవాడివా? ఇక్కడ వంటలు చేస్తుంటావా? నాకూ నేర్పగలవా? 89 00:05:55,314 --> 00:05:56,857 నీకు ఆలుగడ్డలు కావాలా వద్దా? 90 00:05:56,857 --> 00:05:58,483 ఆలుగడ్డలతో నేనేం చేసుకోను? 91 00:05:58,483 --> 00:06:00,903 నువ్వు ఇచ్చేటట్టయితే నేను తీసుకుంటాను ఆలుగడ్డలు. 92 00:06:00,903 --> 00:06:03,405 ఇదిగో. రెండు తీసుకో. -సరే. 93 00:06:04,198 --> 00:06:06,700 హే, నేను ఇప్పుడే షాన్ తో మాట్లాడాను. 94 00:06:06,700 --> 00:06:09,578 పీటీఎస్డీ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నాను. 95 00:06:09,578 --> 00:06:11,413 కానీ తను దాని గురించి మాట్లాడదలచుకోలేదు. 96 00:06:11,413 --> 00:06:13,749 మాజీ సైనికుల్లో అది మామూలే. 97 00:06:13,749 --> 00:06:16,543 ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉందంటారు? 98 00:06:16,543 --> 00:06:19,004 జవాబు చాలా తేలిక. ఎప్పుడూ ఉండదు. 99 00:06:19,588 --> 00:06:21,924 చెడగొట్టుకున్నావు. రెండు రకాల బంధాలు పెంచుకొని. 100 00:06:21,924 --> 00:06:27,179 ఒక స్నేహితుడిగాను, సహవాసిగాను భావిస్తున్నాడు నిన్ను థెరపిస్ట్ గా కాకుండా. 101 00:06:27,930 --> 00:06:32,893 బహుశా మా మధ్య హద్దులు గీస్తే, ఉపయోగం ఉందంటారా అని... 102 00:06:33,644 --> 00:06:35,896 సారీ... బజర్ నొక్కావా నాకు? 103 00:06:35,896 --> 00:06:36,980 అవును. 104 00:06:37,981 --> 00:06:41,860 నీ రోగులతో అలా ప్రవర్తించద్దని నీకు చెప్పాను. అయినా నువ్వు అదే చేశావు. 105 00:06:41,860 --> 00:06:44,238 మంచిది. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించాలని లేదుగా? 106 00:06:44,238 --> 00:06:46,615 అసలు ఆ విషయం గురించి నీతో నేను మాట్లాడబోను. 107 00:06:46,615 --> 00:06:48,825 కానీ ఆలుగడ్డల గురించి మాట్లాడతావు. 108 00:06:48,825 --> 00:06:52,704 రోజంతా. వాటిని కావలసినంత ఆస్వాదించవయ్యా. 109 00:06:53,872 --> 00:06:55,791 ఉడికించుకో, కాల్చుకో, వేయించుకో. 110 00:06:55,791 --> 00:06:58,502 ఒకదానికి ఒకటి రుద్ది నిప్పు పుట్టించుకో. ఏం చేసినా నాకు అనవసరం. 111 00:06:58,502 --> 00:07:00,671 ఏపిల్ తిన్నట్టు తినేస్తాను పోనీ, పాల్. 112 00:07:06,927 --> 00:07:07,970 ఆపు. 113 00:07:14,852 --> 00:07:16,103 వావ్. 114 00:07:18,063 --> 00:07:19,064 ఎలెక్ట్రొలైట్స్. 115 00:07:19,982 --> 00:07:21,316 నేను అడగలేదు. 116 00:07:23,777 --> 00:07:24,903 వీడు ఇక్కడకెందుకు వచ్చాడు? 117 00:07:27,865 --> 00:07:30,534 కొత్త మొక్కా? ఏమిటది? ఫెర్న్ అంటారా? 118 00:07:30,534 --> 00:07:31,869 తెలియదు. -సరే. 119 00:07:33,370 --> 00:07:34,371 ఓహో, మంచిది. 120 00:07:34,955 --> 00:07:35,956 ఎందుకు వచ్చావు? 121 00:07:35,956 --> 00:07:38,750 నా ఈమెయిల్ కి, ఫోన్ కాల్స్ కి అందకుండా నువ్వు దాక్కున్న గత మూడేళ్ళలో 122 00:07:38,750 --> 00:07:42,087 నేను నీ ఎస్టేట్ ప్లాన్ కోసం నేను చేసిన రివిజన్ పని అంతా ఇచ్చి పోదామని వచ్చాను. 123 00:07:43,797 --> 00:07:45,215 అది ఘనకార్యం ఏం కాదు. 124 00:07:45,716 --> 00:07:47,050 ఇప్పుడు చర్చిద్దామా దాని గురించి? 125 00:07:47,050 --> 00:07:49,344 ఇప్పుడు సరైన సమయం కాదు. మా అమ్మాయి వస్తోంది. 126 00:07:50,179 --> 00:07:52,347 కూతురి ప్రియమైన తండ్రి! భలే. 127 00:07:56,143 --> 00:07:58,270 ఏం లేదా? చెప్పేది ఇంకేం లేదా? సరే. 128 00:07:58,270 --> 00:08:01,148 ప్రత్యామ్నాయ శక్తి గురించి ప్రసంగించటానికి వస్తోంది. 129 00:08:01,148 --> 00:08:02,357 తనకి ఆట్టే సమయం లేదు. 130 00:08:02,357 --> 00:08:04,776 అందుకే నాతో కొన్ని గంటలే గడపగలదు. 131 00:08:04,776 --> 00:08:07,654 నా రొట్టె విరిగి నేతిలో పడింది. నాకిష్టమైన సామెత అది. 132 00:08:07,654 --> 00:08:10,199 నేనిక్కడే ఆగి, నీ మెడికల్ పవర్ ఆఫ్ ఎటార్నీ మీద తన సంతకం తీసుకుంటాను. 133 00:08:10,199 --> 00:08:12,743 నాకలా అనిపించట్లేదు. -ఏంటి? అయ్యో. 134 00:08:14,286 --> 00:08:17,372 కానీ, నీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దాన్ని వాయిదా వేయటం అంత మంచిది కాదే. 135 00:08:17,372 --> 00:08:20,959 ఎటార్నీ-క్లయంట్ ఒప్పందాలు క్రిమినల్ లాయర్లకే వర్తిస్తాయా, 136 00:08:20,959 --> 00:08:23,003 లాయర్లుగా నటించేవారికి కూడానా? 137 00:08:23,003 --> 00:08:25,130 ఎస్టేట్ లా అనేది నిజమైనదే. నేను నిజమైన లాయర్నే. 138 00:08:25,130 --> 00:08:26,798 అవునా కాదా? -అవును. 139 00:08:28,592 --> 00:08:29,718 మీ సమాచారం అతిభద్రం. 140 00:08:30,469 --> 00:08:32,554 నాకు పార్కిన్సన్స్ ఉన్నట్టు మెగ్ కి తెలియదు. 141 00:08:34,014 --> 00:08:36,850 అంటే మీ ఇద్దరి మధ్యా సత్సంబంధాలు లేవా? 142 00:08:39,061 --> 00:08:40,062 మీ సమాచారం అతిభద్రం. 143 00:08:40,062 --> 00:08:41,563 ఇక ఆ మాట అనకు. -సరే. 144 00:08:42,856 --> 00:08:44,691 తన చిన్న వయసులోనే వాళ్ళమ్మ, నేను విడిపోయాము. 145 00:08:44,691 --> 00:08:47,611 వాళ్ళు ఈస్ట్ కోస్ట్ కి మారిపోయారు. మా మధ్య దూరం పెరిగిపోయింది. 146 00:08:48,654 --> 00:08:49,947 ఇక మాటామంతీ కష్టమయ్యింది. 147 00:08:49,947 --> 00:08:52,741 ఏం? అప్పట్లో ఫోన్లు, విమానాలు లేవా? 148 00:08:55,035 --> 00:08:56,828 సారీ. నువ్వు మనసులో మాట చెప్తుంటే వెటకారం చేస్తున్నాను. 149 00:08:57,913 --> 00:09:00,541 నీ పొరపాట్లు నువ్వు తెలుసుకోవటమే నీ గొప్ప సుగుణం. 150 00:09:01,959 --> 00:09:04,211 అయితే ఇది ఇప్పుడే చేయటం ముఖ్యమంటావా? 151 00:09:04,795 --> 00:09:05,796 అవును. 152 00:09:06,797 --> 00:09:09,383 సరే. నేను తనకి విషయం చెప్పి వీటిపై సంతకాలు పెట్టిస్తాను. 153 00:09:09,383 --> 00:09:12,427 మంచిది. ఈ కాగితాలు నాకు మెయిల్ చేస్తావా, లేకపోతే 154 00:09:12,427 --> 00:09:14,429 డౌన్టౌన్ లోని నా ఆఫీసుకి తెచ్చి ఇస్తావా? 155 00:09:14,429 --> 00:09:17,099 ఎవరినైనా ఇక్కడకి వచ్చి తీసుకువెళ్ళమని చెప్పు. 156 00:09:17,099 --> 00:09:19,059 నాకంత శ్రమ లేకుండా. -సరే. 157 00:09:19,059 --> 00:09:21,520 నా అసిస్టెంట్ కెవిన్ ని పురమాయించచ్చు అనుకో. 158 00:09:22,855 --> 00:09:25,899 కెవిన్. కెవిన్! 159 00:09:28,402 --> 00:09:29,403 కెవిన్. 160 00:09:31,905 --> 00:09:33,448 నేనేనా కెవిన్ ని? 161 00:09:34,366 --> 00:09:37,202 సరే. త్వరలో కలుస్తాను. 162 00:09:38,370 --> 00:09:39,454 వచ్చినందుకు సంతోషం. 163 00:09:39,454 --> 00:09:40,998 అయ్యో, భలేవారే. -చెప్పకుండా. 164 00:09:40,998 --> 00:09:43,333 చెప్పాను ఈమెయిల్ లో, కాల్ లో, మెసేజ్ లో కూడా. 165 00:09:43,834 --> 00:09:44,835 కనుక... 166 00:09:50,674 --> 00:09:52,259 హే, బంగారం. -హే. 167 00:09:52,259 --> 00:09:54,178 బాల్ శబ్దం విని వచ్చాను. నేనూ ఆడనా? -అలాగే. 168 00:09:58,515 --> 00:10:00,767 భలే! -ముగ్గురు కొడుకులతో ఆడిన అనుభవం. 169 00:10:01,560 --> 00:10:03,770 అన్నట్టు రాత్రి కానర్ వస్తున్నాడు కాలేజ్ నుంచి. 170 00:10:04,563 --> 00:10:06,231 అడిగానని చెప్పండి. -అలాగే. 171 00:10:06,732 --> 00:10:09,693 హే, లిజ్. హాయ్. -హే, గ్యాబ్. 172 00:10:09,693 --> 00:10:13,071 నేను ఆలీస్ కి తెచ్చిచ్చిన బాస్కెట్ బాల్ తో తనతో కలసి నాలుగు బాల్స్ వేద్దామని. 173 00:10:13,071 --> 00:10:14,573 అవునవును. 174 00:10:14,573 --> 00:10:16,742 తనకి నువ్వు బాస్కెట్ బాల్ తెచ్చి ఇచ్చాననటం గుర్తుంది. 175 00:10:16,742 --> 00:10:17,910 అదే. -మంచిది. 176 00:10:17,910 --> 00:10:20,871 మీరిద్దరూ ఆడుకోండి. -థాంక్యూ. 177 00:10:20,871 --> 00:10:23,790 మంచిది. నిన్ను కలవటం సంతోషం. 178 00:10:23,790 --> 00:10:25,042 నిన్ను కలవటం మరీ ఆనందం. 179 00:10:25,042 --> 00:10:27,586 అవును. షూ చాలా బాగున్నాయి. -థాంక్యూ. జోర్డాన్స్ కంపెనీవి. 180 00:10:27,586 --> 00:10:28,670 ఆహా. మంచిది. -అవును. 181 00:10:28,670 --> 00:10:30,172 మళ్లీ కలుస్తానర్రా. 182 00:10:30,172 --> 00:10:31,715 సంతోషం. -సంతోషం. 183 00:10:32,841 --> 00:10:36,678 అబ్బా, మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందే. 184 00:10:36,678 --> 00:10:38,305 మూసుకొని బాల్ వేయవోయ్. 185 00:10:42,226 --> 00:10:43,560 ఆహా. 186 00:10:44,144 --> 00:10:47,022 ఇదే. కొంచెం షూ విప్పుతారా? 187 00:10:47,022 --> 00:10:49,483 ఓసీడీతో చెప్పట్లేదు. కానీ నేను జపాన్ లో ఉండి వచ్చాను కనుక... 188 00:10:49,983 --> 00:10:52,027 పాసడీనా వదిలి ఎక్కడికీ వెళ్ళలేదని నాకు గతంలో చెప్పారు. గుర్తుంది. 189 00:10:52,986 --> 00:10:56,698 సరే, ఓసీడీతోనే చెప్తున్నాను. కానీ జపాన్ దేశస్తులు పిచ్చివాళ్ళు కాదు. 190 00:10:56,698 --> 00:10:57,783 సరే. 191 00:10:59,034 --> 00:11:00,035 మొదలుపెడదామా? 192 00:11:01,870 --> 00:11:03,956 ఆ పార్క్ బెంచ్ మీద కూర్చున్నప్పుడు వేసుకున్న 193 00:11:03,956 --> 00:11:06,375 అదే జీన్స్ వేసుకొని మీ సోఫా మీద కూర్చుంటున్నాను. సరేనా? 194 00:11:10,420 --> 00:11:12,422 ఇప్పుడు మీ వంతు. -నేను ఇంట్లో వేసుకొనే బట్టలు వేసుకోవాలి. 195 00:11:12,422 --> 00:11:14,341 ఇవి బయటకి వెళ్లినప్పుడు వేసుకొనేవి. నావల్ల కాదు. 196 00:11:14,341 --> 00:11:15,634 అది... -హే. మీ వల్ల అవుతుంది. 197 00:11:16,635 --> 00:11:19,221 వచ్చి ఇలా నా పక్కన కూర్చోండి. చాలు. -సరే. 198 00:11:24,393 --> 00:11:26,603 కళ్ళు తెరవండి. -నాకు భయం. 199 00:11:26,603 --> 00:11:28,522 తెలుసు, కానీ నేను మీ పక్కనే ఉన్నాను. 200 00:11:32,192 --> 00:11:34,653 ఎలా అనిపించింది. -పర్వాలేదు. 201 00:11:34,653 --> 00:11:36,196 అదేంటి వాలీ? 202 00:11:36,196 --> 00:11:38,448 అయితే మీరు ఏదైనా చేయగలరు అనిపిస్తోంది. 203 00:11:38,949 --> 00:11:42,619 వాలీ, మీరు అద్భుతమైన వ్యక్తి. 204 00:11:43,328 --> 00:11:45,455 అయ్యో. ఆగండాగండి. -అయ్యయ్యో. 205 00:11:45,455 --> 00:11:47,165 నేను ఊహించలేదు. -క్షమించండి! 206 00:11:47,165 --> 00:11:48,292 నేను పిచ్చిమొద్దుని. 207 00:11:48,292 --> 00:11:50,002 భయపడకండి. -అసలు నేను ఏమనుకున్నాను? 208 00:11:50,002 --> 00:11:51,962 నేను అపార్థం చేసుకున్నట్టున్నాను. మీరిలా రావటం, 209 00:11:51,962 --> 00:11:55,340 నన్ను అద్భుతమైన వ్యక్తి అనటం. నేను అద్భుతమైన వ్యక్తిని కానని నాకు తెలుసు. 210 00:11:55,340 --> 00:11:57,301 ఉండండి. వాలీ, మీరు అద్భుతమైన వ్యక్తే. 211 00:11:57,301 --> 00:12:00,053 నేను... లేదు, వాలీ. మళ్లీ అలా చేయకండి. -దేవుడా! 212 00:12:00,053 --> 00:12:02,389 నా జీవితంలోనే అతి దారుణమైన రోజు ఇది. 213 00:12:02,389 --> 00:12:04,808 హోల్ ఫుడ్స్ కొట్లో నా బట్టలు పాడుచేసుకున్న రోజు అతి దారుణం అనుకొనేదాన్ని. 214 00:12:04,808 --> 00:12:07,102 అది నిజంగా దారుణమైన సంఘటన. కానీ ఇది అంతకంటే దారుణం. 215 00:12:07,102 --> 00:12:10,314 నాకు అంతా గందరగోళంగా ఉంది! -గందరగోళంగా అనుకోవద్దు. ఎందుకంటే, 216 00:12:10,314 --> 00:12:12,608 ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. -నిజమా? 217 00:12:12,608 --> 00:12:15,444 లేదు, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. కానీ పర్వాలేదు. 218 00:12:15,444 --> 00:12:18,906 దేవుడా. నేనొక అయోమయం పిచ్చిమొద్దుని. -కాదు. ఇక ఆపండి! 219 00:12:18,906 --> 00:12:22,159 పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు సాధించినవాటికి నేను గర్వపడుతున్నాను. 220 00:12:22,159 --> 00:12:23,911 అంతే. ముమ్మాటికీ అంతే. 221 00:12:23,911 --> 00:12:26,538 చూడండి, మీరు చింతించాల్సింది ఏమీ లేదు. 222 00:12:27,915 --> 00:12:30,000 నేను చింతిస్తున్నట్టు ఉన్నానా? -లేరు. 223 00:12:30,918 --> 00:12:33,337 కానీ నేను నమ్మను. కళ్ళలో కళ్ళు పెట్టి ఎక్కువగా చూస్తున్నారుగా? 224 00:12:36,798 --> 00:12:37,799 ఛ! 225 00:12:40,844 --> 00:12:43,138 మీ షూస్ మరచిపోయారు. -థాంక్స్. 226 00:12:45,557 --> 00:12:47,309 అందుకే నేను "ఛ!" అని అరిచినది. -సరే, వెళ్లి రండి. 227 00:12:48,852 --> 00:12:50,854 రాత్రి ఇంటికి వస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు? 228 00:12:50,854 --> 00:12:52,231 ఇదిగో. -థాంక్స్. 229 00:12:52,731 --> 00:12:53,607 వావ్, ఈ కానర్ ఎవరేంటి? 230 00:12:53,607 --> 00:12:55,234 నీకెందుకోయ్? -అంతేలే. 231 00:12:56,360 --> 00:12:57,361 లిజ్ వాళ్ళ అబ్బాయి. 232 00:12:57,361 --> 00:12:59,905 అవునులే, ఆమెకి కానర్ అనే కొడుకు ఉండకుండా ఎలా ఉంటాడు? 233 00:12:59,905 --> 00:13:01,365 కాలేజ్ నుంచి వస్తున్నాడు. 234 00:13:01,365 --> 00:13:03,492 కాలేజ్ లో చదివే కుర్రాడా? -కాలేజ్ కుర్రాడే. 235 00:13:03,492 --> 00:13:04,660 ఖచ్చితంగా బాగుంటాడా? 236 00:13:04,660 --> 00:13:06,828 ముద్దులు ముచ్చట్లు ఏమైనా నడుపుతావా అతనితో? 237 00:13:06,828 --> 00:13:08,664 అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. -నిజమా? 238 00:13:08,664 --> 00:13:10,707 అవును. -ఎంతవరకు వెళ్లింది? 239 00:13:12,543 --> 00:13:13,669 చాలా ముందుకే వెళ్లింది. 240 00:13:14,503 --> 00:13:16,296 చివరి వరకు వెళ్లిందన్నమాట. -అవును, నేనే కావాలనుకున్నాను. 241 00:13:16,296 --> 00:13:20,300 కానర్ గదిలో చదువుకుంటున్నాము. లిజ్ లసాన్యా చేస్తున్నారు. 242 00:13:20,300 --> 00:13:21,802 నేను, 243 00:13:21,802 --> 00:13:25,138 "మనిద్దరం కలిసి గడిపితే ఎలా ఉంటుంది? ఒక పనైపోతుంది కదా?" అని అడిగాను. 244 00:13:25,138 --> 00:13:28,767 అతను, "ఆహా. కొవ్వొత్తి వెలిగించమంటావా?" అన్నాడు. 245 00:13:28,767 --> 00:13:32,229 అబ్బా, కానర్. కొవ్వొత్తి ఏంటిరా బాబూ? -అదే కదా? 246 00:13:32,229 --> 00:13:34,356 కానీ అలా అయిపోయింది. 247 00:13:34,356 --> 00:13:36,483 మంచిది. బాగుంది. -అవును. 248 00:13:38,193 --> 00:13:39,653 మీ అమ్మ ఈ విషయంలో నీతో మాట్లాడిందేమో కదా? 249 00:13:39,653 --> 00:13:43,532 అంటే శృంగారం అయిపోయాక ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్ళాలి, అలాంటివన్నీ చెప్పిందిగా? 250 00:13:43,532 --> 00:13:45,367 అలాంటివన్నీ చెప్పిందిగా? -అవును. 251 00:13:45,367 --> 00:13:47,035 అమ్మ నాకు అవన్నీ చెప్పింది. 252 00:13:48,078 --> 00:13:52,708 గర్భనిరోధకాల గురించి మానసికంగా సిద్ధంగా ఎలా ఉండాలని. 253 00:13:52,708 --> 00:13:55,460 ఇంకోటి కూడా చెప్పింది. పురుషాంగం విచిత్రంగా అనిపిస్తే, 254 00:13:55,460 --> 00:13:57,504 మనసు మార్చుకోవచ్చు అని కూడా. -అవును, అది నిజమే. 255 00:13:57,504 --> 00:14:00,215 ఎందుకంటే చాలామందికి విచిత్రంగానే ఉంటాయి. 256 00:14:01,508 --> 00:14:02,843 మీ అమ్మ చాలా గొప్ప వ్యక్తి. 257 00:14:04,761 --> 00:14:08,015 ఈ విషయం కూడా చెప్పిందా? మరీ ఎక్కువసేపు అవుతుంటే, 258 00:14:08,015 --> 00:14:10,475 మధ్యలో వేలు పెట్టటం ద్వారా ముగింపుకి తీసుకురావచ్చని. 259 00:14:10,475 --> 00:14:11,560 ఏమిటది? 260 00:14:12,895 --> 00:14:14,146 తనతోనా, నాతోనా? 261 00:14:14,855 --> 00:14:15,856 ఏదైనా పర్లేదు. 262 00:14:18,859 --> 00:14:23,030 హాయ్. క్షమించండి. పాల్ రోడ్స్ కోసం చూస్తున్నాను. 263 00:14:23,030 --> 00:14:25,073 ఆ మూలకి ఒక వెయిటింగ్ రూమ్ ఉంది. 264 00:14:25,073 --> 00:14:26,825 స్విచ్ నొక్కితే మీరు వచ్చినట్టు ఆయనకి తెలుస్తుంది. 265 00:14:26,825 --> 00:14:29,536 నేను పేషెంట్ ని కాను. ఆయన మా నాన్న. నా పేరు మెగ్. 266 00:14:29,536 --> 00:14:30,621 అయ్యో! 267 00:14:30,621 --> 00:14:32,706 మీరు కనెక్టికట్ మెగ్ అన్నమాట. 268 00:14:33,290 --> 00:14:35,751 హాయ్. వావ్. నా పేరు జిమ్మీ. 269 00:14:35,751 --> 00:14:36,919 పాసడీనా జిమ్మీ. 270 00:14:36,919 --> 00:14:38,921 సరే. అంతే. అవును. 271 00:14:38,921 --> 00:14:40,631 చివరికి మిమ్మల్ని కలిశాను. బాగుంది. -అవును. 272 00:14:40,631 --> 00:14:44,343 అబ్బా, మీ గురించి ఎన్నో కబుర్లు విన్నాను. నిజానికి వినలేదు. కానీ వింటే బాగుండు అనుకున్నాను. 273 00:14:44,343 --> 00:14:46,053 పాల్ ఆఫీస్ ఆ పక్క గది. 274 00:14:46,053 --> 00:14:47,179 థాంక్యూ. -మంచిది. 275 00:14:47,679 --> 00:14:49,473 మీ బల్ల మీద ఆలుగడ్డలు ఉన్నాయేమిటి? 276 00:14:49,973 --> 00:14:52,142 మెగ్, మీ నాన్న నా మీదకి విసిరాడు. 277 00:14:52,142 --> 00:14:54,895 అయితే మీరిద్దరూ సన్నిహితులు అన్నమాట. -క్లిష్టమైన ప్రశ్న. 278 00:14:54,895 --> 00:14:56,897 నేను అర్థం చేసుకోగలను. -అవును. 279 00:14:57,940 --> 00:15:00,025 అందులో ఒకటి కొరికి ఉంది. 280 00:15:00,025 --> 00:15:01,401 బాగా కోపం తెప్పించాడు. 281 00:15:01,401 --> 00:15:04,696 అందుకే ఒకదానిని పచ్చిగానే కసిగా కొరికేశాను ఏపిల్ కొరికినట్టు. 282 00:15:06,156 --> 00:15:07,950 పాల్! పాల్, నాకెవరు దొరికారో చూడు. 283 00:15:07,950 --> 00:15:09,826 హాయ్, నాన్నా. -మెగ్. 284 00:15:09,826 --> 00:15:11,995 మీ అమ్మాయి భలే వ్యక్తి, పాల్. 285 00:15:11,995 --> 00:15:14,331 నీకా అభిప్రాయం కలిగినందుకు చాలా ఊరటగా ఉంది. 286 00:15:16,959 --> 00:15:18,001 ఏం మనిషో! 287 00:15:19,002 --> 00:15:21,296 అందరి భోజనమూ అయ్యేవరకు ఎవ్వరూ టేబుల్ మీద నుంచి 288 00:15:21,296 --> 00:15:23,882 లేవకూడదు కదా అంటున్నాను. -అవును. ఒప్పుకుంటాను. 289 00:15:23,882 --> 00:15:25,634 పూర్తిగా విందు భోజనం. అప్పచ్చులతో. 290 00:15:26,385 --> 00:15:29,054 ఏం కబుర్లు చెప్పుకుంటున్నారు? -ఆడవాళ్ళ శృంగారం కబుర్లు. 291 00:15:29,888 --> 00:15:31,098 అది నిజం కాదు. 292 00:15:32,266 --> 00:15:34,184 ఆ మాటకి నువ్వు నవ్వావు. అమ్మయ్య. 293 00:15:34,184 --> 00:15:37,521 మీ ఇద్దరి మధ్య ఆ సంభాషణ ఎలా వచ్చింది? 294 00:15:37,521 --> 00:15:40,274 ఈ విషయం చెప్తే తను మామూలుగా స్పందించవచ్చేమో. 295 00:15:40,274 --> 00:15:42,734 సరదా అయిన తండ్రిగా ప్రవర్తించే అవకాశం నువ్వు ఇస్తేనే బాగుంటుందేమో. 296 00:15:43,986 --> 00:15:45,654 నా రోజు అస్సలు బాగా గడవలేదు. 297 00:15:46,154 --> 00:15:48,615 సరదా తండ్రిగా ఉండటం నాకిప్పుడు చాలా అవసరం. 298 00:15:48,615 --> 00:15:51,201 రెచ్చిపోతానంతే. చెప్పండి. 299 00:15:54,454 --> 00:15:55,289 సరే. 300 00:15:55,789 --> 00:15:58,709 సరే, నేనిప్పుడే గ్యాబీతో ఏం చెప్తున్నానంటే, 301 00:15:58,709 --> 00:16:04,423 కానర్ కాలేజ్ కి వెళ్ళకముందు మేమిద్దరం కలసి గడిపిన విషయం. 302 00:16:11,138 --> 00:16:13,015 నీకది పర్వాలేదా? 303 00:16:13,599 --> 00:16:14,516 పర్వాలేదు. 304 00:16:15,767 --> 00:16:16,977 రక్షణ వాడావా? 305 00:16:17,603 --> 00:16:18,604 ఖచ్చితంగా. 306 00:16:19,980 --> 00:16:21,315 అతను రక్షణ వాడాడా? 307 00:16:23,192 --> 00:16:25,694 అవును. అవును. 308 00:16:25,694 --> 00:16:27,905 మీరిద్దరూ నాకీ విషయం చెప్పినందుకు సంతోషం. 309 00:16:29,406 --> 00:16:30,449 థాంక్స్, సరదా నాన్నా. 310 00:16:31,033 --> 00:16:32,492 నేను రెచ్చిపోలేదు. 311 00:16:39,208 --> 00:16:41,210 నువ్వు తనకి చెప్పినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. 312 00:16:42,044 --> 00:16:44,379 నిజంగానా? ఎందుకు? 313 00:16:44,379 --> 00:16:46,006 ఎందుకంటే నువ్వైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి కనుక. 314 00:16:48,842 --> 00:16:49,718 హే, జిమ్మీ. 315 00:16:49,718 --> 00:16:51,303 ఎక్కడ చూసినా నువ్వుంటావే. 316 00:16:52,846 --> 00:16:53,805 ఉండగలిగితేనా? 317 00:16:56,350 --> 00:16:57,309 బానే ఉన్నావా? 318 00:16:59,228 --> 00:17:00,979 ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు, లిజ్. 319 00:17:00,979 --> 00:17:03,440 నువ్వు చింతిస్తున్నావని అర్థమవుతోంది. 320 00:17:04,608 --> 00:17:05,608 హలో? 321 00:17:07,152 --> 00:17:09,070 హలో అండీ? -నీ పని నువ్వు చూసుకోలేవా అసలు? 322 00:17:10,364 --> 00:17:11,365 కలగజేసుకోవలసిందే కదా? 323 00:17:11,365 --> 00:17:13,367 సరే. చెప్తాను, లిజ్. 324 00:17:13,367 --> 00:17:15,577 నా పెంపకం విషయంలో ఎప్పుడూ విమర్శిస్తావు కదా? 325 00:17:16,869 --> 00:17:18,829 ఆహా. -ఆహా. అవును. సరే. 326 00:17:18,829 --> 00:17:20,165 ఇంతకుముందే నాకేం తెలిసిందో తెలుసా? 327 00:17:20,165 --> 00:17:22,917 ఎవరో ఆలీస్ తో శృంగారం సలిపారు. 328 00:17:22,917 --> 00:17:25,378 తనకి నమ్మకద్రోహం చేయలేను కనుక, ఎవరో నీకు చెప్పను. 329 00:17:25,378 --> 00:17:26,630 కానీ నువ్వు ఊహించవచ్చు. 330 00:17:28,089 --> 00:17:29,091 కానర్. 331 00:17:30,968 --> 00:17:31,927 అబ్బో. 332 00:17:31,927 --> 00:17:34,596 "అబ్బో". అంతేనా? "అబ్బో" అట! 333 00:17:34,596 --> 00:17:37,558 ఏమో. ఇప్పుడు అర్థమవుతోంది. 334 00:17:37,558 --> 00:17:39,268 వాళ్లిద్దరూ కలసి చాలా సమయం గడిపేవారు. 335 00:17:39,268 --> 00:17:41,311 అది... -నాకు తలనొప్పిగా ఉంది, లిజ్. 336 00:17:44,356 --> 00:17:46,441 ఈమధ్య ఎప్పుడు తలనొప్పి వచ్చినా నీవల్లే అవుతోంది. 337 00:17:46,441 --> 00:17:48,861 ఒక్కసారి మాత్రం నావల్లే. మందుల అల్మారాకి గుద్దుకున్నప్పుడు. 338 00:17:48,861 --> 00:17:50,946 మిగతా అన్నిసార్లూ నీవల్లే. థాంక్యూ. 339 00:17:50,946 --> 00:17:53,782 మా అమ్మాయిని అస్తమానం మీ ఇంటి చుట్టూ తిప్పుకున్నందుకు థాంక్యూ. 340 00:17:53,782 --> 00:17:57,536 అవును. తను సున్నితమైన స్థితిలో ఉంది. మీ అబ్బాయి దాన్ని వాడుకున్నాడు. 341 00:17:57,536 --> 00:18:01,331 అది న్యాయం కాదు. కానర్ అసలు అలాంటి... -నేను మాట్లాడటం ఇంకా అవ్వలేదు. 342 00:18:04,376 --> 00:18:05,961 ఈరోజు ఉద్యోగంలో కూడా చండాలంగానే గడిచింది. 343 00:18:06,628 --> 00:18:08,172 ఒక పేషెంట్ నన్ను తప్పించుకు తిరిగారు. 344 00:18:08,172 --> 00:18:11,216 ఇంకొకరు నాకేం చెప్పదలచుకోనివాడు. ఇంకొకరు నాకు దగ్గరవ్వాలని చూసినవారు. 345 00:18:11,216 --> 00:18:13,177 నీకు మానసిక వైద్యం గురించి ఏం తెలియదని నాకు తెలుసు, లిజ్, 346 00:18:13,177 --> 00:18:14,261 కానీ అది మంచి పరిస్థితి కాదు. 347 00:18:15,179 --> 00:18:17,055 మామూలుగా అయితే, పాల్ తో అది చక్కబెట్టుకొనేవాడిని. 348 00:18:17,055 --> 00:18:20,392 కానీ నీ దయ వల్ల, తను నాతో ఏం మాట్లాడట్లేదు, ఆలుగడ్డల గురించి తప్ప. 349 00:18:20,392 --> 00:18:21,643 అందుకు నన్ను క్షమించావు కదా? 350 00:18:21,643 --> 00:18:22,853 ఇప్పుడు క్షమాపణ రద్దు అయిపోయింది. 351 00:18:23,687 --> 00:18:26,231 నీ హద్దుకి అవతలే నువ్వు ఉండు, లిజ్. 352 00:18:26,231 --> 00:18:29,193 అసలు ఇకపై మా ఇంటి ఛాయల్లోకి కూడా రావటం నిషేధం. 353 00:18:29,193 --> 00:18:30,569 నిషేధమా? -నిషేధం. 354 00:18:31,153 --> 00:18:32,988 నిషేధించబడిన, క్షమాపణ రద్దైనదానివి. 355 00:18:32,988 --> 00:18:36,617 ఇక నేను లోపలకి వెళ్ళాలి. ఎందుకంటే నేను చిందులు వేస్తున్నాను ఇక్కడ. 356 00:18:36,617 --> 00:18:38,827 చాలా చాలా ఒళ్ళు మండిపోయి ఉన్నాను! 357 00:18:38,827 --> 00:18:41,163 జిమ్మీ. -ఒళ్ళు మండి ఉన్నాను, లిజ్. 358 00:18:41,997 --> 00:18:44,374 నీకు ఏం కావాలో గానీ, అది ఇక్కడ మాత్రం లేదు. 359 00:18:44,958 --> 00:18:46,502 లిజ్? లిజ్ కి కావలసింది? 360 00:18:46,502 --> 00:18:49,296 లిజ్ కి కావలసింది? ఇక్కడున్నావా? లిజ్ కి కావలసింది? 361 00:18:49,296 --> 00:18:53,634 ఇక్కడ లేదు! నీకేం కావాలో అది ఎక్కడో వెతుక్కో, నీ సొంత స్నేహితులని నువ్వు వెతుక్కో. 362 00:18:54,134 --> 00:18:56,428 పో, లిజ్. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు! 363 00:18:59,056 --> 00:19:01,558 బా... బాగుంది. 364 00:19:03,060 --> 00:19:05,854 మీ అమ్మ ఎలా ఉంది? అవునా? -బాగుంది. 365 00:19:05,854 --> 00:19:08,440 యూరప్ లో తనవాడితో హుషారుగా షికారు చేస్తోంది. 366 00:19:08,440 --> 00:19:11,944 ఇప్పుడిక వీడి పేరు కూడా తెలుసుకోవాలా నేను? -వాళ్ళకి పెళ్ళై ఆరేళ్ళయ్యింది. 367 00:19:11,944 --> 00:19:13,362 అతన్ని "బడ్డీ" అని పిలుస్తానంతే. 368 00:19:14,613 --> 00:19:18,992 అన్నట్టు నీకు ఒకటి తెచ్చాను. మేసన్ కొత్త ఫోటో. 369 00:19:21,036 --> 00:19:22,246 వావ్. 370 00:19:22,996 --> 00:19:26,583 అందమైన పిల్లవాడు. -అవును. తండ్రి పోలిక. 371 00:19:26,583 --> 00:19:28,210 లేదు. నీ పోలికే. 372 00:19:28,210 --> 00:19:30,128 నేను ఆ మాటనే ఆశించాను. -చాలా బాగున్నాడు. 373 00:19:30,128 --> 00:19:32,047 ఆ. -ఒప్పుకుంటాను. 374 00:19:33,841 --> 00:19:35,384 చాలా రోజులయ్యింది. 375 00:19:36,635 --> 00:19:38,345 వచ్చే నెల నేను వీలు చూసుకొని వచ్చి, 376 00:19:38,345 --> 00:19:40,097 మీతో కొంత కాలం గడిపితే ఎలా ఉంటుంది? 377 00:19:41,014 --> 00:19:43,141 అది... 378 00:19:45,686 --> 00:19:46,728 చాలా బాగుంటుంది. 379 00:19:47,729 --> 00:19:50,732 కానీ, మేసన్ కి లాక్రోస్ క్యాంప్ ఉంది. 380 00:19:50,732 --> 00:19:54,528 డేవ్ వాళ్ళమ్మ కూడా మాతో ఉంటోంది తన కాలి దెబ్బ తగ్గేవరకు. 381 00:19:54,528 --> 00:19:56,655 ఏమయ్యింది ఆవిడ కాలికి? -ఏమో, ఎవరికి తెలుసు? 382 00:20:00,701 --> 00:20:04,162 హే, నాకు మీతో ఇంకా ఇంకా సమయం గడపాలని ఉంది. 383 00:20:05,831 --> 00:20:08,709 సరే. మేము సమయం కుదుర్చుకుంటాము. 384 00:20:12,504 --> 00:20:13,797 నా కార్ వచ్చేస్తోంది. 385 00:20:15,299 --> 00:20:17,509 ఇంకేంటి విశేషాలు? నువ్వు బాగున్నావా? 386 00:20:18,051 --> 00:20:19,678 ఆరోగ్యపరంగా అంతా బాగున్నట్టేనా? 387 00:20:23,098 --> 00:20:25,726 అంతా బాగుంది. చక్కగా ఉంది. 388 00:20:25,726 --> 00:20:29,062 మంచిది. ఆ ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్ ని ఇంకా డేట్ చేస్తున్నావా? 389 00:20:29,062 --> 00:20:31,565 లేదు. -అయ్యో! ఏమయ్యింది? 390 00:20:31,565 --> 00:20:34,610 మంచి వ్యక్తిలా అనిపించారే. -బర్నింగ్ మ్యాన్ ఉత్సవానికి రమ్మంది తనతో. 391 00:20:35,360 --> 00:20:36,695 ఎంత ధైర్యం తనకి? 392 00:20:38,989 --> 00:20:41,158 నేను బయల్దేరే లోగా అంతా శుభ్రం చేసి వెళ్తాను. 393 00:20:41,158 --> 00:20:42,993 లేదు. నేను చూసుకుంటాను. వదిలేయ్. -పర్వాలేదా? 394 00:20:42,993 --> 00:20:45,204 అవునవును. థాంక్స్. -ఉంటాను. 395 00:20:45,204 --> 00:20:46,288 ఉంటాను. -ఉంటాను. 396 00:20:57,966 --> 00:20:59,301 జిమ్మీ అంతు చూడమంటావా, చెప్పు? 397 00:20:59,968 --> 00:21:01,053 లేదు, పర్లేదు. 398 00:21:01,637 --> 00:21:03,472 మంచిది. అతనంటే నాకు ఇష్టం. 399 00:21:06,183 --> 00:21:09,811 హే! వచ్చేశాడు. ఎలా ఉన్నావురా? -హే, నాన్నా. 400 00:21:09,811 --> 00:21:12,022 హే, అమ్మా. -హాయ్. హాయ్. 401 00:21:16,360 --> 00:21:17,444 చాలాసేపు హత్తుకున్నావే. 402 00:21:17,444 --> 00:21:19,613 నిన్ను చూసి అంత ఆనందంగా ఉంది నాకు. 403 00:21:19,613 --> 00:21:21,615 నీకిష్టమైన పాస్తా చేస్తున్నాను రాత్రికి. 404 00:21:21,615 --> 00:21:23,534 నేను జకూజీలో స్నానం చేసి, 405 00:21:23,534 --> 00:21:26,078 స్నేహితులతో ట్యాకోస్ తిని, థియోస్ కి వెళ్దాం అనుకుంటున్నాను. 406 00:21:26,828 --> 00:21:28,580 అలాగే. అంతేగా? అలాగే కానివ్వు. 407 00:21:30,040 --> 00:21:33,293 హే, కొత్త కుక్కపిల్ల పేరేమిటి? -దాని పేరు షిట్ ర్యాట్. 408 00:21:33,293 --> 00:21:36,630 షిట్ ర్యాట్ ఎవరే? నువ్వేనా? 409 00:21:37,214 --> 00:21:38,924 ఆ. భలే ఉంది. 410 00:21:40,926 --> 00:21:43,011 వాడిని చూడటం ఆనందంగా ఉంది. క్షవరం అవసరం వాడికి. 411 00:21:53,355 --> 00:21:54,189 ఏంటి? 412 00:21:54,189 --> 00:21:56,817 పెద్దవాళ్ళు ట్రాంపొలీన్ మీద ఆడటం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. 413 00:21:56,817 --> 00:21:58,235 సర్కస్ లో కూడా చూడలేదా? 414 00:21:58,819 --> 00:22:00,112 మోకాళ్ళ మీద పడుతున్నా. 415 00:22:00,112 --> 00:22:01,321 వావ్. 416 00:22:01,905 --> 00:22:04,658 లోపల పొంగుతున్న ఆవేశాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నాను. 417 00:22:04,658 --> 00:22:07,411 అయ్యో. నేనేమైనా సహాయం చేయగలనా? 418 00:22:09,079 --> 00:22:10,080 ఆ. 419 00:22:12,749 --> 00:22:14,293 నువ్వు పరదేశంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? 420 00:22:16,378 --> 00:22:17,546 ఏంటి? 421 00:22:17,546 --> 00:22:19,756 చూడు, నువ్వు నాతో నోరు తెరిచి మాట్లాడకపోతే, నీకు సాయం చేయలేను. 422 00:22:20,549 --> 00:22:22,134 నీ మౌనం నన్ను విసిగిస్తోంది. 423 00:22:22,134 --> 00:22:23,260 పద, కానిద్దాం. 424 00:22:23,844 --> 00:22:25,304 "తొందరేం లేదు" అన్నారు మరి? 425 00:22:26,597 --> 00:22:28,390 ఏమోనోయ్. ఇక చాలు. 426 00:22:28,390 --> 00:22:29,850 ఈరోజు ఒక్క విషయంలో అయినా విజయం కావాలి. 427 00:22:29,850 --> 00:22:30,934 ఏమంటావు? 428 00:22:31,643 --> 00:22:34,354 అవతలకి పో. అదే అంటాను నేను. 429 00:22:35,272 --> 00:22:37,649 నేను అవతలకి పోవాలా? -నీకు వినపడిందని తెలుసు, జేమ్స్. అవతలకి పో. 430 00:22:37,649 --> 00:22:38,734 ఒక మాట చెప్పనా? 431 00:22:39,651 --> 00:22:43,322 నీ థెరపిస్ట్ ని అయ్యుండకపోతే ఆ మాటే నేనూ అనేవాడిని! 432 00:22:46,825 --> 00:22:48,952 నేనూ అలా పెట్టగలను. నేనూ పెడతాను. రెండు రకాలుగానూ పెడతాను. 433 00:22:48,952 --> 00:22:51,163 ఎగురుతూ ఎగురుతూ చెప్పగలను. 434 00:22:53,498 --> 00:22:54,499 హే, లిజ్. 435 00:22:55,000 --> 00:22:56,210 హే. 436 00:22:56,793 --> 00:22:58,879 హే, గ్యాబీ. -బాగుందే. 437 00:22:59,963 --> 00:23:00,964 ఎలా చేస్తారు ఇది? 438 00:23:01,465 --> 00:23:04,927 రాళ్ళను సానపెట్టటం. 439 00:23:04,927 --> 00:23:07,221 నేను షికారుకి వెళ్లి, 440 00:23:07,971 --> 00:23:10,933 అగేట్స్ అనే రాళ్ళని వెతుక్కొని ఇంటికి తెచ్చుకొని, వాటిని శుభ్రంగా కడిగి, 441 00:23:10,933 --> 00:23:14,061 వాటిలో మంచివి తీసుకొని, రంపంతో కోసి, 442 00:23:14,061 --> 00:23:15,521 రెండు నెలలపాటు వాటిని సానబెట్టి, 443 00:23:15,521 --> 00:23:18,106 గాజు సీసాల్లో వేసి, నా బాత్రూమ్ లో పెట్టుకుంటాను. 444 00:23:18,106 --> 00:23:20,400 ఎందుకంటే వెలుగు పడ్డప్పుడు అందంగా కనిపిస్తాయి. 445 00:23:20,400 --> 00:23:24,029 అర్థమయ్యింది. నీకిదంతా ధ్యానం చేసినట్టు ప్రశాంతతని ఇస్తుందన్నమాట. 446 00:23:24,029 --> 00:23:26,490 లేదు. ధ్యానం చేసినట్టు కాదు. రాళ్ళు సేకరించినట్టే. 447 00:23:26,990 --> 00:23:28,033 నీకేం కావాలి? 448 00:23:30,410 --> 00:23:33,288 ఇంతకుముందు జిమ్మీ నిన్ను 449 00:23:34,873 --> 00:23:36,500 ఆడిపోసుకోవటం నేను విన్నాను. 450 00:23:36,500 --> 00:23:40,295 అయ్యో పాపం అనిపించింది. 451 00:23:41,213 --> 00:23:44,633 నేను కేవలం ఒక తల్లిని మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ కాదు. 452 00:23:45,133 --> 00:23:46,593 నేను చాలా సరదా మనిషిని. 453 00:23:46,593 --> 00:23:48,887 నేను ఫిల్మ్ లోనే ఫోటోలు తీస్తాను. 454 00:23:48,887 --> 00:23:51,682 జనం నా ప్లేలిస్ట్స్ అడుగుతారు. 455 00:23:51,682 --> 00:23:53,600 చిన్న చిన్న టాటూస్ ఉన్నాయి నాకు. 456 00:23:53,600 --> 00:23:55,686 ఇది నాకిష్టమైనది. ఇది బెల్జియన్ లోఫర్. 457 00:23:55,686 --> 00:23:57,354 అది నిజంగా చాలా బాగుంది, లిజ్. 458 00:23:57,354 --> 00:23:59,439 థాంక్యూ. నాకూ స్నేహితులున్నారు. 459 00:23:59,439 --> 00:24:03,777 కాకపోతే నా ప్రాణస్నేహితురాలు విడాకులై ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. 460 00:24:03,777 --> 00:24:05,153 మేము మాట్లాడుతూ ఉండాలనే అనుకుంటాం. 461 00:24:05,153 --> 00:24:07,990 కానీ అక్కడ ఎంత టైం అయ్యిందో నాకు తెలియదు కదా? 462 00:24:07,990 --> 00:24:09,491 నీకు తెలుసా? -లేదు. ఎవరికి తెలుసు? 463 00:24:09,491 --> 00:24:11,368 అయినా పర్లేదు, ఎందుకంటే నాకు డెరెక్ ఉన్నాడు. 464 00:24:11,368 --> 00:24:14,872 నాకు డెరెక్ అంటే చాలా ప్రేమ. కానీ తను త్వరలోనే రిటైర్ అవుతున్నాడు. 465 00:24:14,872 --> 00:24:18,917 తనని రోజుకి గంటా 45 నిముషాలు మాత్రమే ప్రేమించగలను. 466 00:24:18,917 --> 00:24:22,629 ఇల్లంతా నా కొంగు పట్టుకొని తిరగలేడు కదా? 467 00:24:22,629 --> 00:24:26,300 ఇంట్లో విషయాలన్నీ ఆరాతీస్తూ నా చుట్టూ తిరగలేడు కదా? 468 00:24:26,300 --> 00:24:28,802 బహుశా ఆలీస్ తో ఎక్కువ సమయమే గడుపుతున్నానేమో. 469 00:24:28,802 --> 00:24:31,388 గడిపే ఉండచ్చు. కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే 470 00:24:31,388 --> 00:24:34,892 నేనుగా ముందుకి వచ్చి, ఎవ్వరూ పట్టించుకోని 471 00:24:34,892 --> 00:24:38,270 ఒక చిన్నపిల్ల ఆలనాపాలనా చూడటం తప్పెలా అవుతుందని. 472 00:24:38,937 --> 00:24:41,315 చూడు, అది చాలా ఎక్కువ. సరేనా? 473 00:24:43,442 --> 00:24:45,611 మందు వేయాలనుందా? -బాగా. 474 00:24:46,195 --> 00:24:48,071 చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. నేను అబద్ధమాడాను. 475 00:24:49,156 --> 00:24:51,491 ఆరోజు నేను బాస్కెట్ బాల్ తేలేదు. 476 00:24:53,035 --> 00:24:55,787 థాంక్యూ. నేనూ అబద్ధం చెప్పాను. 477 00:24:57,331 --> 00:24:59,208 రాళ్ళతో పని చేయటం ధ్యానం లాంటిదే. 478 00:24:59,208 --> 00:25:02,169 తెలుసు, బంగారం. తెలుసు. -సరే. 479 00:25:06,340 --> 00:25:07,341 ఆలీస్ హాయ్ - ఏంటి సంగతులు! 480 00:25:07,341 --> 00:25:09,468 జలకాలాడుతున్నాను. నువ్వు కలుస్తావా? 481 00:25:09,468 --> 00:25:11,512 తప్పు ఉద్దేశంతో కాదు. 482 00:25:21,188 --> 00:25:25,567 నువ్వు చేసిన పని నాకు తెలుసు. 483 00:25:29,071 --> 00:25:32,282 మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు అలాగే ఉంచాను. 484 00:25:32,282 --> 00:25:33,659 మిగతావన్నీ సంతకాలు అయిపోయాయి. 485 00:25:36,203 --> 00:25:38,163 అయితే తనకి చెప్పలేకపోయావా? 486 00:25:38,747 --> 00:25:39,873 కష్టమయ్యింది. 487 00:25:41,124 --> 00:25:42,251 అవునా? 488 00:25:43,460 --> 00:25:45,462 కూర్చోకు. ఇంకేం లేదు. -అలాగే. 489 00:25:48,590 --> 00:25:52,678 హే, నేనేం థెరపిస్ట్ ని కాకపోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితిని నా క్లయంట్స్ లో 490 00:25:52,678 --> 00:25:54,263 చాలామంది దగ్గర చూశాను. -అవునా? 491 00:25:54,263 --> 00:25:56,431 ఇంకా... ఒక్క మాట చెప్పనా? 492 00:25:56,431 --> 00:25:58,642 చెప్పు. -నేను... పర్లే... 493 00:25:58,642 --> 00:26:00,060 పర్లేదా... -దేవుడా. కూర్చో. 494 00:26:00,060 --> 00:26:01,103 థాంక్స్. నేను... 495 00:26:03,605 --> 00:26:06,608 తను నీకు సాయంగా రాదేమో అని అనుమానం ఉంటే, 496 00:26:08,443 --> 00:26:09,570 ఇప్పుడే తెలుసుకోవటం నయం. 497 00:26:12,948 --> 00:26:14,116 కాదు, అది కాదు విషయం. 498 00:26:14,116 --> 00:26:16,869 ఏం... మరి ఇంకేంటి విషయం? 499 00:26:16,869 --> 00:26:19,955 ఇక వెళ్లిరా. వెళ్లిరా. థాంక్స్. -అలాగే. 500 00:26:19,955 --> 00:26:23,625 నేను ఏమనుకుంటున్నానంటే, ఈ ముక్కని తీసుకువెళ్లి... సారీ, సారీ. 501 00:26:25,043 --> 00:26:26,503 నన్ను క్షమించండి, మిస్టర్ లేర్డ్. 502 00:26:27,963 --> 00:26:29,381 మేము బాధ్యతగానే నడుచుకున్నాము. నమ్మండి. 503 00:26:29,381 --> 00:26:32,176 మంచిది. సంతోషం. -సరే. మంచిది. 504 00:26:33,385 --> 00:26:36,763 మేము చదువుకుంటున్నాము. అలా జరిగిపోయింది. 505 00:26:36,763 --> 00:26:38,473 వివరాలన్నీ చెప్పాలంటే. 506 00:26:38,473 --> 00:26:40,976 తను చక్కగా, అందంగా ఉంటుంది. 507 00:26:41,643 --> 00:26:45,147 ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. 508 00:26:46,148 --> 00:26:47,191 క్షమించండి. 509 00:26:49,443 --> 00:26:53,572 నువ్వేం తప్పు చేయలేదు, కానర్. 510 00:26:54,615 --> 00:26:58,619 నాకు అస్సలు నచ్చలేదు అన్నంత మాత్రాన, 511 00:26:59,453 --> 00:27:00,662 అది తప్పు పని కాదు. 512 00:27:00,662 --> 00:27:03,207 అయినా నేను మీ అనుమతి అడగాల్సింది. -వద్దు, ఆ పని చేయద్దు. 513 00:27:03,207 --> 00:27:04,541 అలా ఎప్పుడూ చేయద్దు. వద్దు. 514 00:27:08,295 --> 00:27:09,296 అయితే, 515 00:27:10,547 --> 00:27:15,219 తను నా కాల్స్, మెసేజెస్ దేనికీ జవాబు ఇవ్వట్లేదు. 516 00:27:16,678 --> 00:27:18,972 దయచేసి తన జ్ఞాపకాలు నేను మరువలేకపోతున్నాను అని తనకి చెప్తారా? 517 00:27:21,391 --> 00:27:22,392 సున్నా శాతం. 518 00:27:23,977 --> 00:27:25,729 నేను... సరే. -అలాగే. వంద శాతం. 519 00:27:31,902 --> 00:27:35,447 వెనక్కి తగ్గటానికి దాన్ని వాడుకుంటుంది. -హే, లిజ్? 520 00:27:36,698 --> 00:27:37,533 ఏంటి? 521 00:27:38,951 --> 00:27:40,786 క్షమించు. హద్దులు దాటి ప్రవర్తించాను. 522 00:27:41,787 --> 00:27:42,788 పర్వాలేదు. 523 00:27:44,206 --> 00:27:46,583 నాకు ఈరోజు అస్సలు బాగా గడవలేదు. 524 00:27:47,584 --> 00:27:48,669 నాకు కూడా. 525 00:27:50,337 --> 00:27:54,132 లిజ్, ఆలీస్ విషయంలో నీ చొరవకి ఏనాడైనా కృతజ్ఞత తెలిపానా నీకు? 526 00:27:55,551 --> 00:27:56,552 నా విషయంలో కూడా. 527 00:27:58,512 --> 00:27:59,346 లేదు. 528 00:28:01,348 --> 00:28:02,432 థాంక్యూ. 529 00:28:03,433 --> 00:28:04,768 పర్వాలేదు. 530 00:28:05,352 --> 00:28:08,438 చక్కగా చెప్పావు, జిమ్మీ. దా, మాతో మందు కొడుదువుగాని. 531 00:28:09,857 --> 00:28:10,774 రా. 532 00:28:12,860 --> 00:28:15,571 కానర్ 30 ఏళ్ళు వచ్చాక కానీ శృంగారంలో పాల్గొనడు అని 533 00:28:15,571 --> 00:28:17,155 డెరెక్, నేను అనుకున్నాము. 534 00:28:17,155 --> 00:28:19,908 అవును, ఆ మాట మొదలుపెట్టింది ఖచ్చితంగా కానర్ కాదు. 535 00:28:20,993 --> 00:28:21,994 కానీ ఒక విషయం తెలుసా? 536 00:28:21,994 --> 00:28:25,205 నువ్వు నిజంగా చింత పడాల్సింది షాన్ విషయంలో. 537 00:28:25,205 --> 00:28:26,540 ఖచ్చితంగా. 538 00:28:27,416 --> 00:28:29,501 వాళ్ళ మధ్య ఆకర్షణ ఉంది. నేను చూశాను. -అవును. 539 00:28:29,501 --> 00:28:31,378 షాన్ మంచి పిల్లవాడు, సరేనా? 540 00:28:31,378 --> 00:28:34,464 అతను అలాంటివాడు కాదు. కనుక... -కానీ సమస్య అతనితో కాదు. 541 00:28:35,549 --> 00:28:38,510 ఇలా చూడు, జిమ్మీ. నీకు వయసులోకి వచ్చిన కూతురు ఉంది. 542 00:28:39,011 --> 00:28:40,304 ఒకప్పుడు మేమూ అంతే. -అవును. 543 00:28:40,304 --> 00:28:42,598 మాకూ కోరికలు ఉండేవి. 544 00:28:42,598 --> 00:28:44,474 బాగా ఉండేవి. 545 00:28:45,517 --> 00:28:46,351 ఆలోచించు. 546 00:28:46,935 --> 00:28:50,355 ఒక అందమైన నల్లజాతివాడు ఉన్నాడు నీ దగ్గర. 547 00:28:50,856 --> 00:28:53,692 పూల్ హౌస్ లో అందంగా మెరుస్తున్న ఆ చర్మం. అందుబాటులోనే? 548 00:28:53,692 --> 00:28:55,277 అందుబాటులో? 549 00:28:56,320 --> 00:28:57,321 మీకు ఏమాత్రమైనా జాలి ఉంటే, 550 00:28:57,321 --> 00:28:59,656 దయచేసి ఈ సంభాషణ ఇంతటితో ఆపేస్తారా? 551 00:29:03,660 --> 00:29:05,954 నాకూ ఒక షాన్ ఉండేవాడు. -అబ్బా. 552 00:29:05,954 --> 00:29:07,080 అతని పేరు ఆలెన్. 553 00:29:07,581 --> 00:29:09,208 మా నాన్నకి పారాలీగల్ గా పనిచేసేవాడు. 554 00:29:09,750 --> 00:29:13,212 ఇంట్లో ఒక వేడుక జరిగినప్పుడు అతన్ని బాగా సంతోషపెట్టాను. 555 00:29:13,212 --> 00:29:14,505 బట్టలు ఉండగానా, లేకుండానా? 556 00:29:14,505 --> 00:29:15,797 రెండు రకాలుగాను. 557 00:29:15,797 --> 00:29:17,424 ప్యాన్ కేక్ బటర్ కూడా వాడాను. 558 00:29:18,842 --> 00:29:19,676 చాలా బాగుంది. 559 00:29:19,676 --> 00:29:21,845 నా షాన్ పేరు బిల్లీ వర్త్. 560 00:29:21,845 --> 00:29:24,056 అవునా? -ఒక పెరుగు దుకాణంలో పనిచేసేవాడు. 561 00:29:24,556 --> 00:29:28,060 మా అమ్మకి నా బట్టల్లో ఎన్ని మెరుపులు కనిపించాయంటే 562 00:29:28,060 --> 00:29:30,479 నేనొక యక్షుడితో శృంగారం చేశాను అనుకుంది. 563 00:29:31,104 --> 00:29:32,064 తప్పు చెప్తున్నారు. 564 00:29:32,064 --> 00:29:36,109 ఇద్దరూ తప్పుగా చెప్తున్నారు. ఎందుకో చెప్పనా? ఒకటి, మీ ఇద్దరూ పైశాచికులు. ఇద్దరూ కూడా. 565 00:29:36,109 --> 00:29:38,195 రెండు, నేనీ గ్లాస్ తీసుకువెళ్తున్నాను. మళ్లీ తెచ్చి ఇస్తాను. 566 00:29:38,195 --> 00:29:40,113 మూడు, ఎవ్వరికీ నువ్వు చెప్పినది అవసరం లేదు. 567 00:29:40,113 --> 00:29:42,574 నాలుగు, భవిష్యత్తులో ఎటువంటి వేడుకలూ ఇంట్లో జరపను. 568 00:29:43,075 --> 00:29:45,285 ఐదు, షాన్ ఏమీ బాగోడు. -బాగుంటాడు. 569 00:29:45,285 --> 00:29:46,828 ఆరు, అవతలకి పొండి. 570 00:29:46,828 --> 00:29:49,748 జిమ్మీ! వయసులో ఉన్న అమ్మాయిలు అంతే! 571 00:29:50,249 --> 00:29:51,416 అంతే. 572 00:29:53,585 --> 00:29:57,756 ఏమోయ్. ఏమోయ్. కానర్ శృంగారంలో పాల్గొన్నాడు. 573 00:29:57,756 --> 00:29:59,508 డెరెక్, అంత పచ్చిగా మాట్లాడకు. 574 00:30:00,551 --> 00:30:02,427 ఓహో, సరే. కత్తెర ఎక్కడైనా చూశావా? 575 00:30:02,427 --> 00:30:05,222 ఎప్పుడూ ఎక్కడ పెడతామో ఆ డ్రాలో చూశావా? 576 00:30:06,014 --> 00:30:07,015 మంచి ఆలోచన. 577 00:30:10,269 --> 00:30:12,729 నా మాజీ భర్త నొప్పి మాత్రలకి అలవాటుపడ్డాడు. 578 00:30:12,729 --> 00:30:15,274 అది ఇంకా దారుణం. 579 00:30:24,157 --> 00:30:28,036 హే. నాకు కుర్రతనం ఉత్సాహంగా కబుర్లు చెప్పాలనుంది. 580 00:30:28,537 --> 00:30:30,956 ఆట చూస్తున్నావా? -3-2 డాడ్జర్స్. 581 00:30:30,956 --> 00:30:32,875 కూర్చోండి. -థాంక్స్. 582 00:30:38,463 --> 00:30:41,300 ఇతను తొమ్మిదవ హిట్టర్. బ్రన్సన్ ఆగిపోయాడు. 583 00:30:42,134 --> 00:30:43,385 హే, ఇందాకటి విషయంలో... 584 00:30:44,136 --> 00:30:46,805 నేను మాట్లాడకపోవటం విసుగ్గానే ఉంటుందని నాకు తెలుసు. 585 00:30:46,805 --> 00:30:50,517 లేదు, నా వైపు నుంచే ఆలోచించాను. 586 00:30:51,435 --> 00:30:53,395 అది బలహీనతని చూపిస్తుంది. 587 00:30:54,479 --> 00:30:56,023 నాకు ఇక్కడ ఉండటం ఎందుకు ఇష్టమో తెలుసా? 588 00:30:57,024 --> 00:30:58,650 నా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు, 589 00:30:58,650 --> 00:31:01,904 నేను నయం అవ్వనందుకు అపరాధభావంగా ఉండేది. 590 00:31:01,904 --> 00:31:04,615 ఇక్కడ అలా ఎప్పుడూ అనిపించలేదు. -ఈరోజు వరకు. 591 00:31:05,240 --> 00:31:06,867 నేను పొరపాటు చేశాను. క్షమించు. 592 00:31:08,911 --> 00:31:10,078 గుడ్ నైట్. 593 00:31:12,915 --> 00:31:15,834 ఈ ఆట ఇంకాసేపు జరిగేటట్టే ఉంది. ఉండాలనుకుంటే ఉండండి. 594 00:31:54,873 --> 00:31:56,083 షాన్, మెలకువగా ఉన్నావా? 595 00:31:59,336 --> 00:32:00,879 అబ్బా, ఎంత బాగున్నావు. 596 00:32:58,979 --> 00:33:00,981 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్