1 00:00:15,098 --> 00:00:16,683 రేమండ్, పాల్ నీకోసం సిద్ధంగా ఉన్నాడట. 2 00:00:16,683 --> 00:00:17,976 ఆఖరికి. 3 00:00:19,102 --> 00:00:20,979 లీసా, మనం మొదలుపెడదాం. 4 00:00:24,024 --> 00:00:26,443 స్టీవెన్, దా. మనం బయటకి వెళ్లిపోదాం. 5 00:00:26,944 --> 00:00:27,945 ఇవెందుకు? 6 00:00:28,529 --> 00:00:29,530 సరదాకి. 7 00:00:57,474 --> 00:00:59,268 సరదాగా ఉంది కదా? రా. 8 00:00:59,852 --> 00:01:00,853 అమ్మని మరచిపోకు. 9 00:01:02,396 --> 00:01:03,814 ఈరోజు ఈ పని చేయాలంటావా? 10 00:01:03,814 --> 00:01:06,567 చాలా కాలం అయ్యింది. నువ్వు తన చితాభస్మాన్ని విలీనం చేయాలని ఆవిడ కోరుకున్నారు కదా? 11 00:01:06,567 --> 00:01:09,194 అవును, కానీ ఈరోజు గాలి బాగా వీస్తోంది. 12 00:01:10,028 --> 00:01:12,656 నా నోటిలోకి తన చితాభస్మం వెళ్ళటం నాకిష్టం లేదు. -చూడు, నాకర్థమయ్యింది. 13 00:01:14,491 --> 00:01:16,535 ఈ వారంలో చనిపోయిన నా భార్య పుట్టినరోజు ఉంది. 14 00:01:17,619 --> 00:01:18,954 నేను చాలా బాధలో కూరుకుపోయాను. 15 00:01:20,414 --> 00:01:21,957 కానీ మనం ముందుకి సాగాల్సిన అవసరం కూడా ఉంది. 16 00:01:24,042 --> 00:01:25,377 మూసేసి ఉన్నట్టుంది. 17 00:01:25,377 --> 00:01:27,296 ఆ, దానిగురించి కంగారు పడకు. 18 00:01:29,381 --> 00:01:32,593 మీకొక గొప్ప అవార్డ్ వచ్చినట్టుంది కదా? 19 00:01:32,593 --> 00:01:34,344 తప్పొప్పులు ఎంచద్దు... -అబ్బా. 20 00:01:34,344 --> 00:01:37,097 ...మీ గురించి గూగుల్ అలర్ట్ పెట్టుకున్నానులెండి. 21 00:01:37,097 --> 00:01:38,390 అది అనవసరం. 22 00:01:38,390 --> 00:01:41,393 వావ్. తప్పొప్పులు ఎంచద్దని స్పష్టంగా చెప్పానా లేదా? 23 00:01:41,393 --> 00:01:43,604 కానీ అందుకు నేను ఒప్పుకోలేదు కదా? -అది నిజమే. 24 00:01:43,604 --> 00:01:48,483 ఏపీఏ వారు నాకు కెరీర్ అచీవ్మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 25 00:01:48,483 --> 00:01:49,651 అభినందనలు. 26 00:01:49,651 --> 00:01:50,819 చాల్లేవయ్యా, అది ఇబ్బందికరమైనది. 27 00:01:51,612 --> 00:01:54,323 ఈ కష్టకాలంలో నేను చేయగలిగిన సాయం ఏదైనా ఉందా? 28 00:01:54,323 --> 00:01:58,118 అప్పుడే పదవీ విరమణకి నేను సిద్ధంగా లేను. 29 00:01:59,578 --> 00:02:01,914 ఒకటి చెప్పనా? -నువ్వెప్పుడూ మాట్లాడుతూనే ఉంటావని నా అభిప్రాయం. 30 00:02:01,914 --> 00:02:04,625 అవును. కానీ ఇందుకు నేను మీకు డబ్బు కడుతున్నాను. కాబట్టి పర్వాలేదు. 31 00:02:05,167 --> 00:02:08,878 20 ఏళ్ళకు ముందు మిమ్మల్ని చూడటానికి నేను వచ్చినప్పుడు... 32 00:02:08,878 --> 00:02:10,547 22 ఏళ్ళ క్రితం. 33 00:02:10,547 --> 00:02:12,966 ...బాగా తాగేవాడిని, నా వైవాహిక జీవితం బాగోలేదు, 34 00:02:12,966 --> 00:02:16,345 నా ఆత్మవిశ్వాసం చితికిపోయి ఉంది. 35 00:02:16,345 --> 00:02:19,389 ఎలా ఆత్మహత్య చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. 36 00:02:20,224 --> 00:02:23,060 ఇప్పుడు, నా జీవితం ఎంత బాగుందంటే, ఒకోసారి నేనిలా వచ్చి 37 00:02:23,060 --> 00:02:24,686 ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. 38 00:02:25,812 --> 00:02:29,149 ఈరోజు ముసలితనంలో కలుగుతున్న భావాల గురించి, 39 00:02:29,149 --> 00:02:32,152 లెదర్ జాకెట్ వేసుకుంటే బానే ఉంటానా లేదా అన్నదాని గురించి మాట్లాడాలనుకున్నా. 40 00:02:32,152 --> 00:02:33,862 బాగోవు. -అబ్బా. 41 00:02:35,447 --> 00:02:39,159 విను, పాల్. నీ వృత్తిజీవితమంతా జనానికి సాయంచేస్తూ గడిపావు. 42 00:02:39,910 --> 00:02:42,037 కాసేపు ఆ విషయంలో వేడుక చేసుకునే అర్హత నీకుంది. 43 00:02:43,497 --> 00:02:45,374 కొంతమంది ఆ మాటతో ఏకీభవించకపోవచ్చు. 44 00:02:46,333 --> 00:02:47,167 ఆహా, ఎవరు? 45 00:02:48,335 --> 00:02:52,047 సరే. ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను... 46 00:02:54,216 --> 00:02:55,634 నీపట్ల చాలా కృతజ్ఞుడిని. 47 00:02:57,553 --> 00:02:58,971 థాంక్యూ, పాల్. 48 00:03:03,058 --> 00:03:04,059 సంతోషం. 49 00:03:06,687 --> 00:03:08,564 లెదర్ ప్యాంట్ వేసుకుంటే బానే ఉంటానంటావా? 50 00:03:09,273 --> 00:03:11,108 బాగోవు. -బాడీ సూట్ అయితే? 51 00:03:12,693 --> 00:03:14,027 నీ టైం అయిపోయినట్టుంది. 52 00:03:14,027 --> 00:03:17,573 సరే, లీసా. ఉద్యోగంలో విమర్శ అందరికీ వస్తుంది. 53 00:03:17,573 --> 00:03:20,492 కానీ ఉన్నది గోరంత అయితే, దాన్ని కొండంతగా నువ్వు భావిస్తున్నావు. 54 00:03:20,492 --> 00:03:21,702 ఆ మాట నిజమే. 55 00:03:22,536 --> 00:03:25,998 హే, మనిషికి కొలమానం మనిషి పొరపాట్లు కాదు. 56 00:03:26,707 --> 00:03:28,250 కానీ ఇప్పుడు నేనొక మొద్దుని అని నా బాస్ ఉద్దేశం. 57 00:03:28,250 --> 00:03:32,004 అది మీ అమ్మ అభిప్రాయం. మీ బాస్ ది కాదు. నువ్వు మొద్దువి కాదు. 58 00:03:32,004 --> 00:03:33,380 అది నాకెలా తెలుసో చెప్పనా? 59 00:03:34,339 --> 00:03:35,883 ఎందుకంటే నువ్వొక తోపువి కాబట్టి. 60 00:03:36,592 --> 00:03:37,676 నువ్వలా మాట్లాడితే నాకిష్టం. 61 00:03:37,676 --> 00:03:39,261 నేను అందుకే అలా మాట్లాడతాను, పిచ్చమ్మా. 62 00:03:41,096 --> 00:03:43,724 ఇందుకోసమే 90 నిముషాలు డ్రైవ్ చేసి అయినాసరే వస్తుంటాను. 63 00:03:43,724 --> 00:03:45,267 ఎందుకంటే నువ్వు కూడా తోపువి కాబట్టి. 64 00:03:45,851 --> 00:03:48,437 లీసా, ఇక్కడ విషయం నాది కాదు. కానీ, దయచేసి ఆపద్దు. 65 00:03:49,188 --> 00:03:50,898 కానీ మరీ 90 నిముషాలా? 66 00:03:50,898 --> 00:03:53,358 ఒక నల్లజాతి థెరపిస్ట్ ని కలవటానికి అంతసేపు ప్రయాణం చేసి వచ్చినా తప్పులేదు. 67 00:03:53,942 --> 00:03:56,862 మా అమ్మ అహంభావం గురించి నీకు తెలియనిది కాదు. 68 00:03:56,862 --> 00:03:58,780 మా కజిన్ కి ఒక సూట్ కొనాలంటే 69 00:03:58,780 --> 00:04:01,950 మొత్తం మావాళ్ళంతా కలసి మాల్ కి వెళ్తామంటే ఉమ్మడితనం వల్ల కాదు. తెలుసు కదా? 70 00:04:02,659 --> 00:04:04,244 మనలో పరస్పర ఐకమత్యం ఎక్కువ. 71 00:04:04,244 --> 00:04:05,370 థాంక్యూ. 72 00:04:06,079 --> 00:04:08,332 కానీ నిజంగా, మీ కుటుంబంలో ఉమ్మడితనం మరీ ఎక్కువ. 73 00:04:09,833 --> 00:04:11,668 ఇవి తన సీట్సా? 74 00:04:11,668 --> 00:04:13,712 కానీ, తనని ఇక్కడ వదలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. 75 00:04:14,546 --> 00:04:16,882 నీకు పని తేలికవుతుంది అనుకుంటే, ముందు తనతో మాట్లాడచ్చు. 76 00:04:17,507 --> 00:04:18,425 నిజంగానా? -అవును. 77 00:04:18,425 --> 00:04:21,220 ఎప్పుడూ చెప్పలేకపోయిన మాటలన్నీ చెప్పచ్చు. -అన్నీనా? 78 00:04:21,220 --> 00:04:26,016 నీ పురుషాంగాన్ని తను కత్తిరించినట్టు నీకు వచ్చిన కలగురించి వదిలేయచ్చనుకో. 79 00:04:26,016 --> 00:04:26,975 ఆ. 80 00:04:31,396 --> 00:04:35,067 అమ్మా, ఒకోసారి నువ్వు చాలా దారుణంగా ఉండేదానివి. 81 00:04:35,067 --> 00:04:38,111 చాలా క్రూరంగా ఉండేదానివి. బాగా తప్పులు ఎంచేదానివి. 82 00:04:39,238 --> 00:04:41,740 నీ చర్చ్ నుంచి వేలకొద్దీ డాలర్లు కాజేశావు. 83 00:04:42,616 --> 00:04:43,450 అది నాకు తెలియదు. 84 00:04:43,450 --> 00:04:44,868 కానీ నువ్వు నన్ను పెంచావు. 85 00:04:46,537 --> 00:04:47,538 ఐ లవ్ యూ. 86 00:04:47,538 --> 00:04:48,997 చాలా హృద్యంగా ఉంది. 87 00:04:48,997 --> 00:04:49,915 థాంక్స్. -చాలావరకు. 88 00:04:50,999 --> 00:04:53,460 ఇక ఆవిడ చితాభస్మాన్ని విలీనం చేద్దామా? 89 00:04:53,460 --> 00:04:54,628 అలాగే. 90 00:04:56,588 --> 00:04:57,840 కావలసినంత సమయం తీసుకో. 91 00:04:58,507 --> 00:04:59,716 నా పాదాలు చూసుకో. 92 00:05:01,385 --> 00:05:03,095 అలాగే. 93 00:05:04,513 --> 00:05:05,931 నేను అన్నది తప్పు. మనం పరుగెట్టాలి. 94 00:05:07,599 --> 00:05:08,475 అరిగో. 95 00:05:09,893 --> 00:05:11,186 సెక్యూరిటీ. ఆగండి! హే! 96 00:05:13,480 --> 00:05:16,775 పరుగెత్తుతున్నప్పుడు పారేయ్. 97 00:05:18,151 --> 00:05:19,903 {\an8}పరుగెత్తుతూ పారేయ్. పరుగెత్తుతూ పారేయ్. 98 00:05:19,903 --> 00:05:21,780 {\an8}రోజ్ బౌల్ 99 00:06:07,701 --> 00:06:09,953 భలే ప్రయాణం కూ కూ! 100 00:06:10,537 --> 00:06:12,164 ఏం చేస్తున్నావు? 101 00:06:15,918 --> 00:06:18,212 హలో! 102 00:06:43,904 --> 00:06:45,781 ఆలీస్ లేర్డ్ హలో - స్వాగతం ఆలీస్ 103 00:06:45,781 --> 00:06:47,574 హే. 104 00:07:13,308 --> 00:07:14,726 అంతే మన జ్ఞాపకాలు. 105 00:07:16,270 --> 00:07:18,021 కానీ అంతా సరదాగా గడిచింది. 106 00:07:21,316 --> 00:07:23,235 సరే, నాకు నువ్వంటే చాలా ప్రేమ. 107 00:07:47,718 --> 00:07:49,344 {\an8}నీకు సంగీతం వినిపించట్లేదు కూడా. 108 00:07:49,344 --> 00:07:51,889 {\an8}అవును. కానీ నాకు అందులో భాగం పంచుకోవాలని బాగా అనిపించింది. 109 00:07:53,974 --> 00:07:55,976 {\an8}హే, దయచేసి ఇక నా ఇంటి బందిఖానా ఆపేయవా? 110 00:07:56,685 --> 00:07:58,103 {\an8}అలాగే. -నిజంగానా? 111 00:07:58,103 --> 00:07:59,188 {\an8}ఇంకో రెండు వారాల్లో. 112 00:07:59,188 --> 00:08:02,149 {\an8}అది స్వార్థం. -నువ్వు నా కార్ ని కొట్టేశావు, దొంగా! 113 00:08:02,149 --> 00:08:03,108 {\an8}న్యాయమే. 114 00:08:03,108 --> 00:08:06,528 {\an8}హే, నువ్వు వచ్చి మంచం చివర పడుకునేదానివి, గుర్తుందా? 115 00:08:07,196 --> 00:08:10,324 {\an8}నీకు బాగా నచ్చిన పాట గురించి నాకు, మీ అమ్మకి చెప్పేదానివి. 116 00:08:10,324 --> 00:08:12,868 {\an8}వింటూ పండగ చేసుకునేవాళ్ళం. -అవును. 117 00:08:12,868 --> 00:08:15,037 {\an8}అప్పుడు నాకు నచ్చిన పాట నేను వినిపించేవాడిని. 118 00:08:15,037 --> 00:08:17,289 {\an8}నా అభిరుచి దారుణంగా ఉందని అనేదానివి. 119 00:08:17,956 --> 00:08:19,625 {\an8}అవును. నేను అదంతా మిస్ అవుతున్నాను. 120 00:08:19,625 --> 00:08:22,044 {\an8}ఒక మాట చెప్తే సంతోషిస్తావేమో. ఇప్పటికీ నీ అభిరుచి దారుణమే. 121 00:08:22,628 --> 00:08:23,879 {\an8}నీకు ఆ అభిప్రాయం ఇంకా ఉన్నందుకు సంతోషం. 122 00:08:24,838 --> 00:08:26,632 {\an8}మరి, గూగూ డాల్ ఏం పేరు, చెప్పు? 123 00:08:31,887 --> 00:08:32,888 {\an8}సరే. 124 00:08:32,888 --> 00:08:36,350 {\an8}డెరెక్ కోసం. చీర్స్! -థాంక్యూ. 125 00:08:36,350 --> 00:08:38,894 {\an8}బాగుంది. చాలా సంతోషం. 126 00:08:38,894 --> 00:08:40,938 {\an8}రిటైర్ అయినా ఎంత మంచి జుట్టు ఉందో. ఊహూహూ. 127 00:08:42,063 --> 00:08:43,065 {\an8}ప్రపంచం నీ అరచేతిలో ఉన్నట్టే. 128 00:08:43,732 --> 00:08:44,733 {\an8}ఇక చాల్లే. 129 00:08:46,401 --> 00:08:47,903 {\an8}ఏం చేయబోతున్నావు? 130 00:08:47,903 --> 00:08:50,822 {\an8}ఏమో. మొదటి ఏడాదంతా హాయిగా ఇంట్లో గడుపుతానేమో. 131 00:08:51,406 --> 00:08:52,658 {\an8}అందుకే మీ అందరినీ ఇక్కడకి పిలిచాను. 132 00:08:52,658 --> 00:08:54,910 {\an8}నీకోసం సంతోషిస్తున్నాను అన్నది సగం కారణం. 133 00:08:54,910 --> 00:08:56,245 {\an8}నువ్వంటే బోలెడంత ప్రేమ ఉంది. 134 00:08:56,745 --> 00:08:59,790 {\an8}ఇంకో సగం కారణం, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమీ అనుమానాలు రాకూడదని. 135 00:09:01,041 --> 00:09:02,209 {\an8}ఈ టోస్ట్ చాలా గొప్పగా ఉంది. 136 00:09:02,209 --> 00:09:03,335 {\an8}థాంక్యూ. 137 00:09:03,335 --> 00:09:04,920 {\an8}నేను ముఖ్యమైన పెళ్లి వార్త చెప్పాలి. 138 00:09:04,920 --> 00:09:06,380 {\an8}డెరెక్ విషయంలో వేడుక అయిపోయిందా? 139 00:09:06,380 --> 00:09:09,758 {\an8}పర్వాలేదు. నేను బహుశా కొన్నివారాల్లో నా స్నేహితులతో కలసి పెద్ద వేడుక చేసుకోవచ్చు. 140 00:09:09,758 --> 00:09:11,426 {\an8}రెండు మూడు వందల మంది అతిథులతో, కనుక... 141 00:09:11,426 --> 00:09:12,678 {\an8}మేము ఆహ్వానితుల్లో ఉన్నామా? 142 00:09:14,054 --> 00:09:15,264 {\an8}ఇప్పుడిక ఉన్నట్టే. 143 00:09:15,264 --> 00:09:16,807 {\an8}రెండు మూడు వందలమందా? 144 00:09:16,807 --> 00:09:18,851 {\an8}ఏమర్రా, డీ-బోన్ జీవితం మనకంటే ఉల్లాసంగా ఉన్నట్టుందే! 145 00:09:18,851 --> 00:09:22,312 ఏం చెప్పను? నాకు జనం ఇష్టం, జనానికి నేనంటే ఇష్టం. 146 00:09:22,312 --> 00:09:23,814 అది నిజం. కోపం తెప్పించే విషయం కూడా. 147 00:09:23,814 --> 00:09:25,732 హే, హాయ్. నా విషయం మాట్లాడుకోబోయినట్టు ఉన్నాం. 148 00:09:25,732 --> 00:09:26,817 ఏమో. -సారీ. 149 00:09:26,817 --> 00:09:27,901 అవునా? -లేదు. 150 00:09:27,901 --> 00:09:28,819 నాకలా అనిపించట్లేదు. 151 00:09:29,528 --> 00:09:31,446 జిమ్మీ స్థానం మళ్లీ తనకి దక్కింది. 152 00:09:31,446 --> 00:09:34,449 నా పెళ్లి వేడుకలో మళ్లీ తను పాడబోతున్నాడు. 153 00:09:34,449 --> 00:09:35,367 వావ్. 154 00:09:35,367 --> 00:09:37,286 ఎందుకు మళ్లీ తనకి అవకాశం ఇచ్చావు? 155 00:09:37,286 --> 00:09:39,538 ఎందుకంటే నేను దయ, కరుణ గల రాకుమారుణ్ణి కనుక. 156 00:09:39,538 --> 00:09:41,915 నువ్వు రాకుమారిడివో కాదో నాకు తెలియదు. -కాదు. 157 00:09:41,915 --> 00:09:45,586 నేను కూడా వాడు స్వార్థపరుడని నమ్మబలికాను. 158 00:09:45,586 --> 00:09:47,421 అవును, అదన్నమాట. -ఆ, ఇప్పుడర్థమయ్యింది. 159 00:09:47,421 --> 00:09:49,381 స్నేహితులుగా నాకింకా వీళ్ళు నచ్చట్లేదు. 160 00:09:49,381 --> 00:09:51,800 మేమేం పట్టించుకోము. -ఇంకా బలపడతాము కూడా. 161 00:09:51,800 --> 00:09:52,885 అవును. -అవును. 162 00:09:56,847 --> 00:09:58,557 హే, సారీ. ఆలస్యమయ్యింది. పద, వెళ్దాం. 163 00:09:58,557 --> 00:10:00,475 పర్వాలేదు. నిజానికి నేను బాత్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళచ్చా? 164 00:10:00,475 --> 00:10:02,686 గ్యాబీ, హద్దుల్లో ఉండాలి. ఆపుకో. 165 00:10:02,686 --> 00:10:05,981 ఏం మాట్లాడుతున్నావు? నేనెంత నీళ్ళు తాగుతానో తెలుసుగా? ఒక్క క్షణం. 166 00:10:06,982 --> 00:10:09,818 శుభోదయం. -ఓహో. వావ్. 167 00:10:09,818 --> 00:10:11,904 వావ్, ఆ సంభ్రమాశ్చర్య వదనం చాలా బాగుంది. 168 00:10:13,363 --> 00:10:14,865 నువ్వు బాత్రూమ్ కి వెళ్ళాలేమో? 169 00:10:14,865 --> 00:10:16,366 లేదు. దీనికోసమైతే ఆపుకోగలను. 170 00:10:17,576 --> 00:10:19,578 గ్యాబీ, ఈవిడ డాక్టర్ బారం. 171 00:10:20,078 --> 00:10:22,497 నన్ను నగ్నంగా చూశావు కదా, అసలు పేరుతో పిలవచ్చు. 172 00:10:23,498 --> 00:10:26,210 జూలీ. -హలో, జూలీ. నా పేరు గ్యాబీ. 173 00:10:26,877 --> 00:10:28,921 ఇక నేను బట్టలు వేసుకోవాలి. 174 00:10:28,921 --> 00:10:31,215 కానీ నువ్వు ఇతగాడి మూడ్ సరిచేయగలవేమో చూడు. 175 00:10:31,215 --> 00:10:34,134 అవార్డ్ అందుకున్న థెరపిస్ట్ అయినందుకు చాలా చిరాకుగా ఉన్నాడు. 176 00:10:34,134 --> 00:10:36,595 పడకగదిలో ఏమైనా అవార్డులు సంపాదించాడా లేదా? ష్వింగ్! 177 00:10:37,262 --> 00:10:39,473 ఛ. నాకు దానిగురించి చెప్పచ్చు. నిజానికి చెప్పేసేయ్. 178 00:10:39,473 --> 00:10:41,725 ఏంటి? దేవుడా. సారీ. 179 00:10:41,725 --> 00:10:44,228 నేను కంగారులో ఉన్నప్పుడు తికమకగా ఏదేదో వాగేస్తుంటాను. 180 00:10:44,228 --> 00:10:46,438 అదే జరుగుతోంది ఇప్పుడు. సారీ. 181 00:10:46,438 --> 00:10:48,857 తనని అవార్డ్ వేడుకకి తీసుకువెళ్తున్నావా? 182 00:10:48,857 --> 00:10:50,150 బాత్రూమ్ కి పో. 183 00:10:53,195 --> 00:10:54,404 సరదాగా ఉందే. 184 00:10:54,404 --> 00:10:55,781 కదా? 185 00:10:55,781 --> 00:10:59,409 ఆ అవార్డ్ వేడుక వేగస్ లో జరగబోతోంది. 186 00:10:59,409 --> 00:11:02,079 నాకు తెలియదు, నేను... -సరే. శాంతించు. 187 00:11:02,079 --> 00:11:03,413 నేనే వెళ్తానో లేదో. -వద్దు. 188 00:11:03,413 --> 00:11:09,378 నీ సహోద్యోగి పలికిన ఆహ్వానంతో నేను ఉబ్బితబ్బిబ్బు అయినప్పటికీ, 189 00:11:09,962 --> 00:11:14,758 అప్పుడే మనం బోరుకొట్టించే కార్యక్రమాల్లో పక్కపక్కన కూర్చొని పాల్గొనే దశకి వచ్చామో లేదో అనుమానమే. 190 00:11:14,758 --> 00:11:19,221 నేను ఎప్పుడూ ఆ దశకి చేరుకోనేలేదు. గతంలో వివాహితుడిని అయినాకూడా. 191 00:11:31,358 --> 00:11:33,235 బాత్రూమ్ ఎక్కడుందో నాకు తెలియలేదు. 192 00:11:33,235 --> 00:11:34,736 తిన్నగా వెళ్లి ఎడమవైపుకి తిరగాలి. 193 00:11:36,238 --> 00:11:38,532 అబ్బా, తన కాళ్ళు చూడు. -ఒక్క మాట కూడా మాట్లాడకు. 194 00:11:38,532 --> 00:11:40,284 అభినందనలు. -పో. 195 00:11:40,284 --> 00:11:41,410 సరే, నేను వెళ్తున్నా... 196 00:11:45,789 --> 00:11:47,583 కానీ నిజంగా నీ విషయంలో పిచ్చి సంతోషంగా ఉన్నాను. 197 00:11:47,583 --> 00:11:48,834 ఇది ఆదర్శప్రాయమైన విషయం. 198 00:11:48,834 --> 00:11:50,752 నేను ముసలిదాన్ని అయ్యాక శృంగారం అసంభవం అనుకున్నాను 199 00:11:50,752 --> 00:11:52,296 పో. -కానీ ఇక అదే పనిమీద ఉంటాను. 200 00:11:52,296 --> 00:11:54,214 ఇది చాలా బాగుంది. -ఆపు. ఆపు. వెళ్ళు. 201 00:12:03,807 --> 00:12:05,976 నువ్విక్కడ పనిచేయటం చాలా బాగుంది. 202 00:12:05,976 --> 00:12:08,604 అద్భుతమైన కార్పొరేట్ అకౌంటింగ్ ప్రపంచంలో. 203 00:12:09,438 --> 00:12:12,232 నువ్వూ ఆస్వాదిస్తున్నావు అనుకుంటున్నాను. -ఎంత మాట, నాన్నా? 204 00:12:12,232 --> 00:12:13,650 ఈ కాగితాలు స్కాన్ చేయటం నాకెంతో నచ్చింది. 205 00:12:13,650 --> 00:12:17,237 చిన్నప్పుడే నాచేత ఈ పని చేయించి ఉంటే, అసలు ఫుట్ బాల్ ముట్టుకొనేవాడినే కాదు. 206 00:12:17,237 --> 00:12:18,322 ఆ, సరే. 207 00:12:20,199 --> 00:12:21,825 ఈ ఉద్యోగం ఇచ్చినందుకు థాంక్యూ, నాన్నా. 208 00:12:21,825 --> 00:12:24,536 కన్నా. నీ పరిస్థితి బాగున్నందుకు చాలా సంతోషం. 209 00:12:27,581 --> 00:12:29,249 శభాష్. అలాగే కానివ్వు. -అలాగే, సర్. 210 00:12:33,253 --> 00:12:35,797 నాకు ఉద్యోగం వచ్చింది కనుక, మొత్తానికి ఇది ఇవ్వగలుగుతున్నాను. 211 00:12:37,257 --> 00:12:41,762 ఒక పేషెంట్ అద్దె ఇవ్వటంకంటే గర్వకారణం ఇంకేముంటుంది ఒక థెరపిస్ట్ కి? 212 00:12:42,846 --> 00:12:45,599 తనపై మీరు కోపంగా ఉంటూనే, నన్ను చూసి సంతోషించే అవకాశం ఉందా? 213 00:12:45,599 --> 00:12:48,519 కుదురుతుంది. మంచి పని చేశావు, నాయనా. 214 00:12:49,978 --> 00:12:52,689 ఏమిటి నీ సంగతి? -చాలా సంగతులున్నాయి, పాల్. 215 00:12:54,149 --> 00:12:58,153 హే, విను. నీ అవార్డ్ గురించి ఆలోచించాను. 216 00:12:58,153 --> 00:13:01,240 ఎందుకు అందరికీ ఈ అవార్డ్ పిచ్చి పట్టింది? 217 00:13:01,240 --> 00:13:02,324 ఏం అవార్డ్? 218 00:13:02,324 --> 00:13:04,201 పాల్ ని గ్రౌచీ అవార్డ్ కి నామినేట్ చేశారు. 219 00:13:04,201 --> 00:13:06,578 ఏ కారణం లేకుండా ముఖం ముడుచుకొని ఉండేవాళ్ళని 220 00:13:06,578 --> 00:13:07,746 ఆ అవార్డ్ తో సత్కరిస్తుంటారు. 221 00:13:07,746 --> 00:13:09,540 ఈ అవార్డ్ నీ సొంతమైనట్టే, పాల్. 222 00:13:11,083 --> 00:13:14,253 సరే, చూడు. ఈ కెరీర్ అచీవ్మెంట్ అవార్డులు కుదిరినంత 223 00:13:14,253 --> 00:13:16,129 చివరి తరుణంలో ఇస్తుంటారు. 224 00:13:16,129 --> 00:13:20,259 అంటే ఉపన్యాసం ఇవ్వగలిగే ఓపిక మిగిలి ఉండాలి, 225 00:13:20,259 --> 00:13:23,387 వేదికని ఎక్కి, పిచ్చివాగుడు వాగి, పడిపోయేంత ముసలి అయ్యుండకూడదు. 226 00:13:23,387 --> 00:13:26,390 అదే జరిగితే, జనం లేచి నుంచొని కరతాళధ్వనులతో ముంచెత్తుతారు. 227 00:13:26,390 --> 00:13:27,641 నా జీవితం అయిపోయింది. 228 00:13:28,392 --> 00:13:31,395 అన్నిటికీ మించిన దారుణం ఏమిటంటే, ఇప్పుడు నా కూతురు దృష్టిలో నేనొక స్వార్థపరుడిని. 229 00:13:32,271 --> 00:13:35,399 చూడు, నువ్వు చెప్పే ఇవన్నీ చిన్న చిన్న అడ్డంకులు. 230 00:13:35,399 --> 00:13:36,984 వాటిని దాటుకుంటూ పోవాలి. 231 00:13:36,984 --> 00:13:40,320 మెగ్ ని కుటుంబంతో సహా వేగస్ వచ్చి, నీతో ఆనందాన్ని పంచుకోమని ఆహ్వానించచ్చు కదా? 232 00:13:40,320 --> 00:13:41,572 నీకేమైనా పిచ్చా? 233 00:13:41,572 --> 00:13:45,450 మెగ్ నాతో అసలు మాట్లాడటమే లేదు. మేసన్ వయసు పదేళ్ళు. 234 00:13:45,450 --> 00:13:47,286 వాడేం చేస్తాడు? జూదం ఆడతాడా, పిచ్చి తిరుగుడా? 235 00:13:47,286 --> 00:13:49,329 హే, వేగస్ ఇప్పుడు కుటుంబాలకి కూడా బానే ఉంటోంది. 236 00:13:49,329 --> 00:13:52,958 తను చెప్పేది ఏమిటంటే, నీ మనవడు, నువ్వు కలసి జూదం, తిరుగుడు కానివ్వచ్చు. 237 00:13:52,958 --> 00:13:54,877 వాడు నాతో సమానంగా ఆడలేడు. 238 00:13:55,627 --> 00:13:56,879 నేను చేయితిరిగినవాడిని. 239 00:13:58,755 --> 00:14:01,717 వచ్చినందుకు సంతోషం. -ఆ, నేను రావటానికి ఒకటే ఒక్క కారణం. 240 00:14:02,426 --> 00:14:03,969 ఆ పెయింటింగ్ లో ఉన్నది నేనేనా? 241 00:14:05,679 --> 00:14:07,347 అవును, నువ్వే. -ఏమన్నావు? 242 00:14:07,347 --> 00:14:08,849 నువ్వే. 243 00:14:08,849 --> 00:14:13,270 థాంక్యూ. నా మాట నిజం అని ఒక మగవాడు చెప్పగా వింటే ఆనందంగా ఉంటుంది బాబూ. 244 00:14:14,688 --> 00:14:15,898 ఆ లెక్కన ఇంకా ఎక్కువసార్లు ఆ మాట అనాల్సింది. 245 00:14:18,192 --> 00:14:21,820 విను, ఆర్ట్ గేలరీలో నేను అన్న మాటలకి బాధపడుతున్నాను. 246 00:14:21,820 --> 00:14:23,113 కానీ నన్ను నేను క్షమించుకున్నాను. 247 00:14:24,031 --> 00:14:26,658 చాలాసేపు ఆ భావనలో ప్రయాణించాను. రెండు నిముషాలకంటే తక్కువ. 248 00:14:28,410 --> 00:14:31,622 కానీ ఆ షో చాలా బాగుంది, నువ్వు అందులో గెలవటం చాలా బాగుంది. 249 00:14:32,414 --> 00:14:33,415 థాంక్స్. 250 00:14:35,501 --> 00:14:37,294 మనం మొదట కలిసేసరికి నువ్వెలా ఉండేవాడివో తలపించింది. 251 00:14:38,504 --> 00:14:41,006 మనం మళ్లీ ప్రయత్నించచ్చు అంటావా? -ఏంటి? 252 00:14:41,006 --> 00:14:44,426 ఏంటి? మనం ప్రేమించుకోవటం మానలేదని నా అభిప్రాయం. నేనే చెడగొట్టుకున్నాను, అంతే. 253 00:14:45,594 --> 00:14:49,598 ఇప్పటికీ నేను కలసినవాళ్ళందరిలో బాగా సరదాగా ఉండే అందమైనదానివి నువ్వే. 254 00:14:50,474 --> 00:14:54,520 దేవుడా. నీ మాటలకి పడిపోతున్నందుకు నామీద నాకే కోపంగా ఉంది. 255 00:14:55,604 --> 00:14:56,730 ఎక్కడికైనా వెళ్దామా? 256 00:15:00,400 --> 00:15:03,403 వావ్. అవును. 257 00:15:04,196 --> 00:15:05,697 ఆ, ఇది చాలు నాకు. 258 00:15:07,449 --> 00:15:09,243 ఛ, మనం మళ్లీ ఇలా చేస్తున్నామంటే నమ్మలేకపోతున్నాను. 259 00:15:09,243 --> 00:15:11,328 ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, 260 00:15:11,328 --> 00:15:14,331 ఒకసారి మొదలుపెట్టాక, చేస్తూనే ఉంటాము. 261 00:15:14,331 --> 00:15:16,458 అవును. -అంతే కాక, నేను ఇందులో నిష్ణాతుడిని అవుతున్నాను 262 00:15:16,458 --> 00:15:18,877 అవునవును. -జుంబా చేయటం మొదలుపెట్టినప్పటినుండి. 263 00:15:20,254 --> 00:15:21,088 మనిద్దరికీ బాగా సరిపోయింది. 264 00:15:21,088 --> 00:15:23,340 అవునంటావా? అంటే మన శరీరాలు ఒకదానికొకటి సరిగ్గా సరిపోయాయంటావా? 265 00:15:23,340 --> 00:15:25,467 అంటే కింద హాయిగా ఉంది. 266 00:15:25,467 --> 00:15:26,426 ఆహా, థాంక్యూ. 267 00:15:26,426 --> 00:15:27,761 ఆ గొప్పతనం మనిద్దరికీ వర్తిస్తుంది. -ఏంటి? 268 00:15:28,971 --> 00:15:30,430 అమ్మయ్య. 269 00:15:30,430 --> 00:15:32,307 ఇందాక నువ్వు నన్ను రక్షించావు. 270 00:15:32,307 --> 00:15:34,768 కొంచెం ఉంటే నికోతో వెళ్లి ఈ పని చేసేదాన్ని. 271 00:15:34,768 --> 00:15:37,354 నాకోసం ఎంత మారిపోయాడో చెప్తున్నాడు. 272 00:15:37,354 --> 00:15:38,730 తాగుడు మానేశాడట. 273 00:15:38,730 --> 00:15:41,316 నేనెంత బాగుంటానో చెప్తున్నాడు. నాకలా అంటే ఇష్టమని తెలుసుగా? 274 00:15:41,316 --> 00:15:43,485 అవును, నువ్వు బాగుంటావు. -ఓ, థాంక్యూ. 275 00:15:43,485 --> 00:15:45,112 అవును. -అయినా నేనెంత పిచ్చిదానిలా ఆలోచించాను? 276 00:15:45,112 --> 00:15:47,072 అతన్ని రీహ్యాబ్ లో నయం చేయటానికి నేను ఎన్ని వదులుకున్నాను? 277 00:15:47,072 --> 00:15:50,617 టీచింగ్ ఉద్యోగం వదులుకున్నాను. కాన్ఫరెన్స్ లు మానేయాల్సివచ్చాను. 278 00:15:50,617 --> 00:15:54,162 అతని బాగోగులు చూడటంకోసం చాలా అవకాశాలు వదులుకున్నాను. 279 00:15:56,039 --> 00:15:57,791 కనుక నీ సురక్షితమైన శృంగారానికి థాంక్స్. 280 00:15:58,876 --> 00:15:59,960 ఆ. పర్వాలేదు. 281 00:16:03,463 --> 00:16:06,925 నీకీ మాట చెప్పటం వీడికి నచ్చదు కానీ, వీడిని సురక్షితం అనటం వీడికి నచ్చదు. 282 00:16:07,718 --> 00:16:10,429 అంతకంటే "నిబ్బరమైనది" అనో, "రాచఠీవి ఉన్నది" అనో అనచ్చుగా? 283 00:16:10,429 --> 00:16:12,222 "మర్యాదపూర్వకమైనది" అంటే? 284 00:16:12,222 --> 00:16:13,765 "స్థిరమైనది" అంటే? 285 00:16:13,765 --> 00:16:15,017 పోనీ... 286 00:16:16,268 --> 00:16:17,728 "శ్రామిక వర్గానికి చెందినది"? 287 00:16:22,107 --> 00:16:25,527 ఆ, వీడికి నచ్చింది. నచ్చింది. -ఆహా, నచ్చింది. 288 00:16:25,527 --> 00:16:29,031 నాకు నచ్చింది. మా వర్గం వారితో చర్చించి చెప్తాను. 289 00:16:34,119 --> 00:16:35,287 హే, బంగారం. -హే. 290 00:16:35,287 --> 00:16:36,705 ఇద్దరం కలసి ఉత్తరాలు తెచ్చుకుందామా? 291 00:16:36,705 --> 00:16:39,875 నీతో కలసి ఇంటి బయటవరకు నడవమంటున్నావా? 292 00:16:39,875 --> 00:16:41,084 వెనక్కి కూడా. 293 00:16:42,920 --> 00:16:45,464 హే. -హే. హే. 294 00:16:45,464 --> 00:16:46,548 నన్ను చంపేయండి. 295 00:16:47,299 --> 00:16:50,135 లిజ్ నీకు కేటెరింగ్ విషయంలో సాయం చేస్తానంటే తనని అడగరాదూ? 296 00:16:50,135 --> 00:16:51,970 లేదు, ఆరోజు ఏదో సరదాగా మాట్లాడుకున్నాం. 297 00:16:51,970 --> 00:16:54,097 పైగా, మా నాన్న దగ్గర నాకు ఉద్యోగం వచ్చింది. 298 00:16:55,516 --> 00:16:56,975 అదెలా ఉంది? 299 00:16:56,975 --> 00:16:59,019 ఆ అవకాశానికి నేను చాలా కృతజ్ఞుడినై ఉన్నాను. 300 00:16:59,728 --> 00:17:00,729 అబ్బో. 301 00:17:03,607 --> 00:17:05,442 ఎప్పుడైనా ఈ చెట్టుని చూశావా? 302 00:17:06,234 --> 00:17:07,819 కాండం ఎంత గొప్పగా ఉందో? 303 00:17:09,363 --> 00:17:11,031 కొమ్మలు బలంగా ఉన్నాయి. 304 00:17:12,241 --> 00:17:13,575 చాలా అందంగా ఉంది. 305 00:17:13,575 --> 00:17:15,618 డెరెక్, ఆ చెట్టుతో శృంగారంలో పాల్గొనాలని ఉందా? 306 00:17:15,618 --> 00:17:16,744 అది చట్టవిరుద్ధం అనుకుంటా. 307 00:17:16,744 --> 00:17:18,997 నువ్వు ఆగటానికి అది మాత్రం కారణం కాదని చెప్పు దయచేసి. 308 00:17:20,332 --> 00:17:23,417 సరే. నేను లిజ్ తో మాట్లాడి సాయం చేస్తాను. 309 00:17:23,417 --> 00:17:26,922 గ్యాబీ సాయం తీసుకోవచ్చు. దానికి తోడు, నా దగ్గరొక రాయి ఉంది. 310 00:17:28,882 --> 00:17:30,968 ఇంకా దీనికి నువ్వు ఒక రూపం తేవాలి. 311 00:17:30,968 --> 00:17:34,346 లిజ్ తనకి బాగా ఇష్టమైనవాళ్ళకి తను మెరుగుపెట్టిన రాళ్ళలో బాగా మంచివి ఇస్తుంది. 312 00:17:34,346 --> 00:17:39,268 నాకు ఒకటి ఇచ్చింది. డెరెక్ కి, తన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరికి ఇచ్చింది. 313 00:17:40,936 --> 00:17:44,314 వేడుక మొదలయ్యాక, నేను మొదటి ప్రసంగం చేస్తాను. 314 00:17:45,107 --> 00:17:47,693 ఇప్పుడు నిజంగా వినాలనుకుంటున్నావా? అప్పటికప్పుడు వింటే సరదాగా ఉంటుంది కదా? 315 00:17:47,693 --> 00:17:50,112 ఆ, కానీ నాకు ముందుగా వినేయటం సరదా. -సరే. 316 00:17:50,112 --> 00:17:53,031 అయితే, నేను నీ పక్కనే నుంచొని ఉంటాను. 317 00:17:53,031 --> 00:17:56,285 లిజ్ దగ్గర ప్రేక్షకులు. నువ్వు సిద్ధమైతే చెప్పు. 318 00:17:56,285 --> 00:17:59,162 నువ్వు ఇంత దగ్గరగా ఉంటావా? -బహుశా ఇంతే. 319 00:18:00,122 --> 00:18:01,540 చార్లీ ఇక్కడ ఉంటాడు. 320 00:18:01,540 --> 00:18:03,917 తన గురించి పట్టించుకోకు. తను నన్ను చూస్తూ ఉంటాడు. 321 00:18:03,917 --> 00:18:05,460 సరే. 322 00:18:05,460 --> 00:18:07,963 ఆ. శభాష్. అదరగొట్టు. 323 00:18:09,131 --> 00:18:10,549 అది చార్లీకి. -తనకి నచ్చుతుంది. 324 00:18:11,466 --> 00:18:12,551 నేను... ఒక్క క్షణం. 325 00:18:12,551 --> 00:18:14,761 ఎందుకంటే నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. -ఆ. 326 00:18:14,761 --> 00:18:16,471 అవును, అవును, అవును. 327 00:18:17,389 --> 00:18:18,390 ఆహా. 328 00:18:18,390 --> 00:18:21,685 టియా, నాకు నువ్వు దగ్గరుండి పెళ్లిచేయటం గుర్తొస్తోంది. 329 00:18:21,685 --> 00:18:23,604 టియాకి, నాకు. -ఎవరూ పట్టించుకోరు, లిజ్. 330 00:18:23,604 --> 00:18:25,939 అది తప్పు మరి. -దృష్టి ఇక్కడ పెట్టు. 331 00:18:27,566 --> 00:18:28,567 "వివాహం." 332 00:18:33,780 --> 00:18:34,781 నాకు కొంచెం సమయం కావాలి. 333 00:18:35,824 --> 00:18:37,993 వావ్. -ఇది బాగాలేదు. 334 00:18:37,993 --> 00:18:40,913 లేదు. కానీ ఇప్పుడు నీ పెళ్లి కోసం ఇంకా ఎదురుచూస్తున్నాను. 335 00:18:41,496 --> 00:18:43,749 నేను సర్దుకోవాలి. బానే ఉన్నాను. నిదానించాలి. 336 00:18:43,749 --> 00:18:44,875 ఆ. 337 00:18:45,459 --> 00:18:46,627 హైస్కూల్ బాస్కెట్ బాల్ లో, 338 00:18:46,627 --> 00:18:49,171 నన్ను ఎవరైనా ఆడిపోసుకుంటే నాకది ప్రోత్సాహంగా ఉండేది. 339 00:18:49,171 --> 00:18:51,590 ఈ పని చేయటం నావల్ల కాదని నీ అభిప్రాయం అన్నట్టు కాసేపు నటిస్తావా? 340 00:18:51,590 --> 00:18:53,842 నటించక్కరలేదు. నువ్వు ఖచ్చితంగా పాడుచేయబోతున్నావు. 341 00:18:53,842 --> 00:18:55,552 సరే, లిజ్. పోవమ్మా. -ఆ. 342 00:18:55,552 --> 00:18:57,930 ఒకటి చెప్పనా? ఈసారి దీన్ని చదివేస్తాను. 343 00:18:57,930 --> 00:19:00,349 భావావేశం లేకుండా, పదాలను చదివేస్తాను. -ఆ పని చెయ్యి. 344 00:19:02,476 --> 00:19:03,644 "వివాహం"... నావల్ల కాదు. 345 00:19:03,644 --> 00:19:04,728 అయిపోయానురోయ్. 346 00:19:04,728 --> 00:19:05,854 ఖచ్చితంగా. 347 00:19:05,854 --> 00:19:09,233 లిజ్, వెటకారాలు వద్దు. 348 00:19:09,233 --> 00:19:10,734 కొంచెం వెటకారం పర్వాలేదు. 349 00:19:10,734 --> 00:19:13,904 లేదు. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. నిన్న మా అమ్మానాన్నలు వచ్చారు. 350 00:19:13,904 --> 00:19:16,532 గే జంటలు ఎప్పుడూ ఆఖరున ముద్దుపెట్టుకుంటారా, చేయి చేయి తగిలించి 351 00:19:16,532 --> 00:19:17,908 ఊరుకుంటారా అని మా నాన్న అడిగారు. 352 00:19:17,908 --> 00:19:19,076 బ్రయాన్, బ్రయాన్. ఊరుకో. 353 00:19:19,076 --> 00:19:21,703 నేను కొంచెం భయపడ్డాను. కానీ ఒట్టుగా చేసేస్తాను. 354 00:19:23,830 --> 00:19:25,207 వివాహం. 355 00:19:26,041 --> 00:19:28,627 అవతలకి పో, లిజ్! అసలు నువ్వు ముఖ్యం కాదు. -ఒరేయ్. 356 00:19:28,627 --> 00:19:31,421 ఇక్కడ బ్రయాన్, అదృశ్యరూపంలో ఉన్న చార్లీ, నేను ముఖ్యం. 357 00:19:31,421 --> 00:19:33,507 ముఖ్యం. -లిజ్, నన్ను రెచ్చగొట్టకు! 358 00:19:33,507 --> 00:19:35,050 నువ్వు ప్రేక్షకురాలిగా ఉండాలి, అంతే. 359 00:19:35,050 --> 00:19:38,345 ప్రేక్షకులు అంటే బ్లూబెర్రీ తినే వెధవలు అయితే తప్ప, 360 00:19:38,345 --> 00:19:39,471 నువ్వు నీ పాత్ర పోషించట్లేదు. 361 00:19:39,471 --> 00:19:41,431 పోవమ్మా! -కొంచెం నడిచిరా. తనని పట్టించుకోకు. 362 00:19:41,431 --> 00:19:42,891 పో, లిజ్. 363 00:19:42,891 --> 00:19:46,144 నా జీవితపు అతి ముఖ్యమైన రోజుని నువ్వు పాడుచేయటానికి వీలు లేదు. వ్యాకరణ రాక్షసి! 364 00:19:47,604 --> 00:19:49,231 ఈ బ్లూబెర్రీస్ బాగున్నాయి. 365 00:19:49,231 --> 00:19:52,025 ఎలా ఉన్నారు? -బాగున్నాను. 366 00:19:52,025 --> 00:19:54,194 బానే ఉన్నాను, కానీ నేను కాల్ చేసింది అందుకు కాదు. 367 00:19:55,487 --> 00:19:56,405 నేను... 368 00:19:57,197 --> 00:19:58,615 ప్రపంచంలోనే అతిచెత్త ప్రదేశం అని తెలుసు 369 00:19:58,615 --> 00:20:00,742 కానీ వేగస్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? 370 00:20:01,702 --> 00:20:06,081 తప్పొప్పులు ఎంచద్దు కానీ, నాకు చాలా ఇష్టం. 371 00:20:06,665 --> 00:20:07,916 నాకు కూడా. 372 00:20:09,626 --> 00:20:12,796 నువ్వు, మేసన్, డేవ్ నాతో పాటు 373 00:20:12,796 --> 00:20:14,590 అక్కడకి రాగలరా అని. 374 00:20:15,174 --> 00:20:16,633 నా ఖర్చులతో. -వావ్. 375 00:20:19,428 --> 00:20:20,846 అయ్యో, రాలేము. 376 00:20:20,846 --> 00:20:22,514 సారీ. 377 00:20:22,514 --> 00:20:24,808 మేసన్ కి ఈ శనివారం స్కూల్లో నాటకం ఉంది. 378 00:20:26,727 --> 00:20:29,813 పోనీ ఆదివారం రాగలరా? 379 00:20:29,813 --> 00:20:33,483 నేను ఇంకో రెండు రోజులు ఉంటాను అవసరమైతే. -అసలు ఈ వారాంతమే ఎందుకు? 380 00:20:33,483 --> 00:20:37,362 పెద్ద విషయం ఏం కాదు కానీ, ఏపీఏ వాళ్ళు నాకేదో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ ఇస్తున్నారు. 381 00:20:37,362 --> 00:20:41,158 అవునవును. మరచేపోయాను. వృత్తి ముఖ్యం అన్నిటికంటే. తర్వాతే ఇంకేదైనా. 382 00:20:41,158 --> 00:20:43,535 లేదు. దయచేసి మళ్లీ చెప్పనీ. -నాకు వేరే పని ఉంది నాన్నా. 383 00:20:43,535 --> 00:20:45,329 ఏ వారాంతమైనా పర్వాలేదు. -నేను వెళ్ళాలి. 384 00:20:50,751 --> 00:20:51,752 ఛ. 385 00:20:59,593 --> 00:21:03,013 నీకస్సలు ఏమీ తెలియదు. సుత్తి సలహాలు మాత్రం బాగానే ఇస్తావు. 386 00:21:04,181 --> 00:21:05,390 నీ పేషెంటా? 387 00:21:06,225 --> 00:21:09,102 కాదు. నా బాస్, మెంటర్. అవును. 388 00:21:12,022 --> 00:21:12,856 హాయ్, పాల్. 389 00:21:14,399 --> 00:21:18,820 పాల్, కోపం తెప్పించే ఒక సాయం అడగబోతున్నాను. నీ మూడ్ బాగానే ఉందా? 390 00:21:21,573 --> 00:21:23,158 లేదు. -సరే, అయినా నేను పట్టించుకోను. 391 00:21:23,158 --> 00:21:24,284 అడిగేస్తాను. 392 00:21:27,287 --> 00:21:29,915 నేను ప్రొఫెసర్షిప్ కి అప్లై చేస్తున్నాను. -ప్రొఫెసర్షిప్ కా? 393 00:21:31,416 --> 00:21:34,211 గ్యాబీ, విద్యారంగం ఐదవ స్థాయి నరకం. 394 00:21:34,211 --> 00:21:39,842 దాని ముందు స్థాయిల్లో పసిపిల్లలు, పాటలు, ఇంద్రజాలం, కేల్, విద్యారంగం. 395 00:21:39,842 --> 00:21:42,344 ఇంద్రజాలాన్ని ఏం అనద్దు. నేను ఆ క్యాంప్ కి వెళ్ళాను, తెలుసుగా? 396 00:21:42,344 --> 00:21:44,346 నీ చెవిలోంచి ఏమైనా తీశానంటే అవాక్కైపోతావు. 397 00:21:44,346 --> 00:21:46,348 నా చెవుల జోలికి రాకు. -సరే. 398 00:21:47,516 --> 00:21:48,433 నీకేం కావాలి? 399 00:21:49,017 --> 00:21:51,186 నాకు సిఫారసు పత్రం రాయగలవేమో అని. 400 00:21:51,186 --> 00:21:53,480 ప్రొఫెసర్షిప్ కోసం ఎందుకు తహతహలాడుతున్నావు? 401 00:21:53,480 --> 00:21:56,483 ఎందుకంటే ఇప్పుడు నాకున్న పేషెంట్స్ ని చూస్తున్నా నాకింకా సమయం మిగులుతుంది. 402 00:21:56,483 --> 00:21:57,901 అయినా మనం దీనిగురించి మాట్లాడుకున్నాం కదా? 403 00:21:57,901 --> 00:22:01,154 నాలాంటి టీచర్లు ఎక్కువైతే నాలాంటి థెరపిస్ట్ లు ఎక్కువ తయారవుతారు. 404 00:22:01,154 --> 00:22:03,657 నాలాంటి అంటే పొడుగ్గా, అందంగా ఉండేవాళ్ళని కాదు నా ఉద్దేశం. 405 00:22:03,657 --> 00:22:04,741 నేను చెప్పేది... 406 00:22:04,741 --> 00:22:05,826 నల్లజాతివారు. -అవును. 407 00:22:05,826 --> 00:22:09,413 పైగా, సురక్షితమైన శృంగారం ఉండగా నాకు బోలెడంత సమయం ఉంటుంది. 408 00:22:10,539 --> 00:22:11,456 సురక్షిత శృంగారం అంటే? 409 00:22:11,456 --> 00:22:14,418 జీవితాన్ని పాడుచేయని, హాయైన, సులువైన శృంగారం. 410 00:22:14,418 --> 00:22:15,377 జూలీ... 411 00:22:16,128 --> 00:22:17,171 ఆగాగు. 412 00:22:17,754 --> 00:22:22,926 తను స్త్రీ అయినప్పటికీ తనని అలా అనుకోవచ్చా? 413 00:22:22,926 --> 00:22:24,094 ఖచ్చితంగా. 414 00:22:24,094 --> 00:22:25,179 బాగుంది. 415 00:22:27,639 --> 00:22:30,267 ఏం సిఫారసు కావాలంటే అది రాసుకో. సంతకం పెడతాను. 416 00:22:30,767 --> 00:22:33,395 నీకేం శ్రమ ఇవ్వట్లేదు కదా? పోనీ నీ సంతకం కూడా నేనే చేసుకోమంటావేంటి? 417 00:22:33,395 --> 00:22:34,479 అద్భుతం. 418 00:22:38,734 --> 00:22:40,861 ఈ చోటు ఎంత బాగుందో కదా? -చాలా బాగుంది. 419 00:22:40,861 --> 00:22:43,155 చిన్న వివాహవేడుక. కనుక పది లక్షలే ఖర్చుపెడుతున్నాం. 420 00:22:43,822 --> 00:22:46,158 నిజంగానా? -వెటకారం ఎప్పుడూ అర్థం కాదు. 421 00:22:47,492 --> 00:22:49,620 తన జోక్స్ ఎవరికి అర్థం కాకపోయినా ఈ మాటే అంటాడు బ్రయాన్. 422 00:22:57,961 --> 00:22:59,379 ఓహో, వెడ్డింగ్ ప్లానర్ వచ్చారు. -హే. 423 00:22:59,379 --> 00:23:00,881 ఇప్పుడే వస్తాను. -సరే. 424 00:23:02,716 --> 00:23:03,717 నాకు నచ్చాడు. 425 00:23:04,218 --> 00:23:05,219 నాకు కూడా. 426 00:23:07,054 --> 00:23:08,639 మీరు రావటం నాకు నిజంగా సంతోషం. 427 00:23:08,639 --> 00:23:10,015 రాకుండా ఎలా ఉంటాను? 428 00:23:12,100 --> 00:23:14,561 సంప్రదాయబద్ధంగా టక్సెడో వేసుకుంటావా అయితే? 429 00:23:15,646 --> 00:23:18,524 అవును, నేను వేసుకోబోయే దుస్తుల్లో అది కూడా ఒకటి. 430 00:23:19,316 --> 00:23:20,901 రకరకాల బట్టలు వేసుకుంటారు కూడానా? 431 00:23:20,901 --> 00:23:23,028 అవును, నా 16వ పుట్టినరోజు నాటిలాగే. 432 00:23:23,737 --> 00:23:25,614 నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. 433 00:23:27,366 --> 00:23:31,078 జిమ్మీ నా తోడపెళ్లికొడుకుగా ఉండాలి. కానీ తను పెళ్లి వేడుకలో పాడబోతున్నాడు. 434 00:23:31,078 --> 00:23:32,162 కనుక... 435 00:23:34,581 --> 00:23:36,166 మీరు నా పక్కన ఉంటారా అని. 436 00:23:39,461 --> 00:23:42,256 నువ్వలా అడిగినందుకు సంతోషంగా ఉంది, బ్రయాన్. 437 00:23:43,257 --> 00:23:44,258 కానీ నేను... 438 00:23:45,843 --> 00:23:48,011 నేను మీ అమ్మ పక్కన కూర్చుంటే ఎక్కువ సంతోషిస్తాను. 439 00:23:49,346 --> 00:23:51,265 అలాగే. పర్వాలేదు. 440 00:24:02,526 --> 00:24:05,487 ఇంట్లోనే ఉండటం చిరాకుగా ఉంది. కానీ తను నాతో ఎక్కువసేపు గడుపుతున్నాడు. 441 00:24:05,487 --> 00:24:08,282 నా హోంవర్క్ చూస్తూ, భోజనం వండుతూ. 442 00:24:08,282 --> 00:24:09,366 పూర్తిగా నాన్నలా ప్రవర్తిస్తూ. 443 00:24:09,992 --> 00:24:12,244 అయితే ఆనందమేగా? -అవును. 444 00:24:15,038 --> 00:24:16,290 నా టోపీ నాకు ఇచ్చేసేయ్. 445 00:24:16,290 --> 00:24:18,625 ఎండగా, వేడిగా ఉందని నన్ను పెట్టుకోమన్నావు కదా? 446 00:24:18,625 --> 00:24:19,918 ఇప్పుడు నాకు వేడిగా ఉంది. 447 00:24:21,211 --> 00:24:22,212 సరే. 448 00:24:22,212 --> 00:24:23,213 హే. 449 00:24:23,797 --> 00:24:25,174 హే. -ఏమైనా అంతరాయం కలిగిస్తున్నానా? 450 00:24:25,174 --> 00:24:27,301 ఇప్పుడే అయిపోయింది. -మంచిది. 451 00:24:27,301 --> 00:24:28,844 టోపీ గురించి నేను పరిహాసం చేయచ్చా? 452 00:24:29,761 --> 00:24:30,679 చేయకపోతే మంచిది. 453 00:24:30,679 --> 00:24:33,056 నేను దింపనా? అమ్మని కలవటానికి వెళ్తున్నాను. వస్తానంటే రావచ్చు. 454 00:24:33,849 --> 00:24:35,976 నేను సైకిల్ మీద వచ్చాను. అది కాక, షాన్ కి ఒక సాయం చేయాలి. 455 00:24:35,976 --> 00:24:37,144 ఆ. -పర్వాలేదా? 456 00:24:37,144 --> 00:24:38,228 చాలా పర్వాలేదు. 457 00:24:38,228 --> 00:24:39,313 సరే. 458 00:24:40,439 --> 00:24:42,482 పాల్, 40ల దశకంలో న్యూస్ రూమ్ కి నువ్వు తిరిగివెళ్ళేలోగా, 459 00:24:43,066 --> 00:24:45,110 సారీ, నా పొరపాట్లు ఎప్పుడూ చెప్తుంటావు. 460 00:24:47,070 --> 00:24:48,780 నేనూ తిరిగి ఆ సాయం చేయాలి కదా? 461 00:24:48,780 --> 00:24:50,741 నాకు అవసరం లేదులే. -నీ అవసరాన్ని బట్టి ఉండదు. 462 00:24:50,741 --> 00:24:52,075 అబ్బో. 463 00:24:52,075 --> 00:24:55,412 చూడు, నువ్వు మెగ్ ని వేగస్ కి రమ్మన్నావు, తను కాదంది, అది బాధాకరం. 464 00:24:55,412 --> 00:24:57,497 కానీ ఒకటి చెప్పనా? కనీసం నీ మనసులో భావం తనకి చెప్పావు కదా? 465 00:24:57,497 --> 00:24:58,916 అదే నువ్వు చేయాల్సింది. 466 00:24:58,916 --> 00:25:00,000 ఆ మాట నిజం. 467 00:25:00,000 --> 00:25:01,585 నిన్ను ఎవరు అడిగారు? నిన్ను మాత్రం? 468 00:25:02,336 --> 00:25:05,130 మెగ్ తో వారాంతం గడపలేకపోవటానికి కారణం ఆ అవార్డ్. 469 00:25:05,130 --> 00:25:09,176 ఆ సుత్తి అవార్డ్ నాకు పోస్ట్ లో పంపేయచ్చు కదా? 470 00:25:09,176 --> 00:25:12,888 దేవుడా, ఇప్పుడు వెళ్ళనే వెళ్ళను అంటున్నావా? ఇది నీకు గౌరవం, పాల్. 471 00:25:12,888 --> 00:25:14,431 కావాలంటే నేను నీతో వస్తాను. 472 00:25:14,431 --> 00:25:16,099 ఒప్పించటానికి పనికొచ్చే మాట కాదది. 473 00:25:17,226 --> 00:25:21,605 నీతో శృంగారంలో ఉన్న ఆ డాక్టర్ మాటేమిటి? 474 00:25:22,147 --> 00:25:26,193 నీ డాక్టర్ తో పాల్గొంటున్నావా? అబ్బా. బాగుంటుందా? నీకు తనంటే ఇష్టమా? 475 00:25:26,193 --> 00:25:27,569 ఇష్టమనే చెప్పింది గ్యాబీ. 476 00:25:27,569 --> 00:25:32,032 గ్యాబీ ఇంకో మాట కూడా అంది. ఆమె కాళ్ళు చాలా బాగుంటాయని! 477 00:25:32,032 --> 00:25:34,368 ఓహో. -ఈ గ్యాబీని తన్నాలి. 478 00:25:34,368 --> 00:25:36,078 నీకు తనంటే ఇష్టం, పాల్. తనని అడుగు. 479 00:25:36,078 --> 00:25:38,330 సున్నితంగా ఉండటం నీకు ఎందుకంత కష్టం? 480 00:25:38,330 --> 00:25:40,541 నువ్వు, నీ కోవెల, 481 00:25:42,000 --> 00:25:42,876 అది పాత రోత విషయం. 482 00:25:43,585 --> 00:25:47,130 ఒకోసారి మన భావాలు మనం ప్రకటించుకోవాలి. ప్రేమ తెలియపరచేలా ఏదైనా చేయాలి. 483 00:25:47,881 --> 00:25:49,258 ప్రేమ తెలియపరిస్తే జనానికి నచ్చుతుంది. 484 00:25:49,258 --> 00:25:51,134 బాగా తెలియపరచాలి. 485 00:25:52,010 --> 00:25:54,972 అయిపోయిందా? -నా మాట వింటానంటేనే. 486 00:25:54,972 --> 00:25:57,307 అయితే కష్టమే. 487 00:25:58,100 --> 00:25:59,101 నేనన్నది సరైనదని నీకు తెలుసు. 488 00:26:01,144 --> 00:26:03,438 అబ్బో. నీకలా చెప్పటం నాకు చాలా బాగా అనిపించింది. 489 00:26:03,438 --> 00:26:05,816 హే, మీ ఇద్దరినీ ఐ లవ్ యూ. 490 00:26:05,816 --> 00:26:06,900 సెలవు. 491 00:26:10,320 --> 00:26:11,321 పద. 492 00:26:12,030 --> 00:26:13,490 తను బాగుంటున్నాడని చెప్పలేదూ? 493 00:26:15,951 --> 00:26:17,244 చిరాకు పెట్టిస్తున్నాడు. 494 00:26:23,166 --> 00:26:27,754 అయితే వైట్ గిల్ట్ కేటరింగ్ విషయంలో నువ్వు సీరియస్ గానే ఉన్నావన్నమాట. 495 00:26:27,754 --> 00:26:30,674 ఆ పేరు ఖరారు కాదనుకోండి. కానీ ఉన్నాను. 496 00:26:30,674 --> 00:26:32,426 నాకు పెట్టుబడిదారులు కావాలి, మీరు కలగజేసుకుంటా అన్నారు. 497 00:26:32,426 --> 00:26:35,429 మనం సరదాగా మాట్లాడుకున్నాం, ఇప్పుడు కాదంటున్నావా? 498 00:26:35,429 --> 00:26:38,223 అవును, కానీ ఇప్పుడు కొంచెం భయం వేస్తోంది. 499 00:26:38,807 --> 00:26:40,434 హే, భయమెందుకు? 500 00:26:40,434 --> 00:26:41,894 నువ్వు మద్దతు ఇస్తున్నావా? -ఆ. 501 00:26:41,894 --> 00:26:43,937 చిన్నకారు నల్లజాతి పరిశ్రమలకి నా మద్దతు ఇవ్వటం నాకిష్టం. 502 00:26:43,937 --> 00:26:45,647 ఏమేం పరిశ్రమలకి మద్దతు ఇస్తుంటావు? 503 00:26:45,647 --> 00:26:47,107 నాదే ఒక నల్లజాతి పరిశ్రమ. 504 00:26:47,733 --> 00:26:49,943 చాలా డబ్బుతో కూడిన వ్యవహారం. నేను డెరెక్ తో మాట్లాడాలి. 505 00:26:49,943 --> 00:26:51,862 అందరూ శాంతించండి. -సరే. తప్పకుండా. 506 00:26:51,862 --> 00:26:53,822 హే, డీ-ట్రెయిన్. 507 00:26:55,490 --> 00:26:56,491 ఏంటి, జీ-స్పాట్? 508 00:26:56,491 --> 00:26:59,036 షాన్ కొత్త కేటరింగ్ వ్యాపారానికి లిజ్ 20 వేలు ఇస్తే నీకేమైనా అభ్యంతరమా? 509 00:27:00,412 --> 00:27:01,413 అలాగే. 510 00:27:02,122 --> 00:27:05,584 కొద్దిగా టైం తీసుకొని ఆలోచించినప్పటికీ మొత్తానికి ఒప్పుకున్నాడు. నీకు అంగీకారమేనా? 511 00:27:06,084 --> 00:27:09,254 ఏమో. ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. 512 00:27:09,796 --> 00:27:11,590 లిజ్, నువ్వు నాకిది ఇవ్వటం గుర్తుందా? 513 00:27:11,590 --> 00:27:13,300 ఆ రాయిని పణంగా పెడుతున్నావా ఇప్పుడు? 514 00:27:14,510 --> 00:27:15,802 ఇది చాలా అందమైన రాయి. 515 00:27:16,553 --> 00:27:19,348 నాకూ కావాలి. -నీకింకా అంత అర్హత లేదు, "జీ-స్పాట్". 516 00:27:20,516 --> 00:27:22,309 అమ్మ చనిపోయినప్పుడు నాకు ఇచ్చావు. 517 00:27:22,309 --> 00:27:25,646 నీకు నాపట్ల ఉన్న ప్రేమకు ఇది ప్రతీక అని చెప్పావు. 518 00:27:25,646 --> 00:27:27,189 ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉంటానన్నావు. 519 00:27:27,189 --> 00:27:30,651 గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు నాకు ఆలంబనగా నిలిచావు. 520 00:27:31,318 --> 00:27:34,071 అందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. థాంక్యూ. 521 00:27:34,696 --> 00:27:35,697 సంతోషం. 522 00:27:36,281 --> 00:27:37,616 ఇలా అడగటం న్యాయం కాదేమో కానీ, 523 00:27:37,616 --> 00:27:39,701 ఇంకొక్కసారి నాకు ఆలంబనగా ఉండగలవా 524 00:27:39,701 --> 00:27:41,119 షాన్ కి సాయం చేయటం ద్వారా? 525 00:27:42,579 --> 00:27:45,332 ఎంత జిత్తులమారిదానిలా తయారయ్యావో తెలుసా? 526 00:27:45,332 --> 00:27:46,834 ఆ, చాలా బాగా లాక్కొచ్చావు. 527 00:27:47,960 --> 00:27:49,461 అయితే? 528 00:27:51,255 --> 00:27:52,256 సరే, అలాగే కానిద్దాం. 529 00:27:52,256 --> 00:27:54,633 అమ్మయ్య! -యే! 530 00:27:54,633 --> 00:27:55,926 బాగుంది. -చూశావా? 531 00:27:57,177 --> 00:28:00,973 మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ లో కూడా నేను సాయం చేయగలను. మర్చెండైజ్ విషయంలో నాకు తిరుగులేదు. 532 00:28:00,973 --> 00:28:03,100 అదే అసలైన విషయం. మీరు అసలు కలగజేసుకోవలసిన అవసరం లేదు. 533 00:28:03,100 --> 00:28:04,601 నేను మొత్తం చూసుకుంటాను. 534 00:28:06,395 --> 00:28:08,564 మంచిది. -థాంక్యూ. థాంక్యూ. 535 00:28:08,564 --> 00:28:09,815 భలే ఒప్పించావు. 536 00:28:09,815 --> 00:28:11,733 నువ్వెంత మంచిదానివి. థాంక్యూ. -మీరు బంగారం, లిజ్. 537 00:28:15,863 --> 00:28:18,073 హే. ఇలా రా. 538 00:28:20,325 --> 00:28:22,661 చిన్నబుచ్చుకున్నావు కదా? సారీ. 539 00:28:25,914 --> 00:28:27,666 నాకు ఒక రాయి ఇవ్వచ్చు కదా? -కుదరదు. 540 00:28:27,666 --> 00:28:29,001 అబ్బా, మరీ అలా అనేయకు. 541 00:28:29,001 --> 00:28:30,586 లేదు, నువ్వు ఈరోజు నాపై జిత్తులు చేశావు. 542 00:28:43,182 --> 00:28:45,392 హే. -హాయ్. 543 00:28:46,643 --> 00:28:49,605 ఈ వారాంతంలో నాతో రావటం నీకు ఇష్టమేనా? 544 00:28:50,189 --> 00:28:51,023 ఎప్పుడు? 545 00:28:52,649 --> 00:28:53,859 ఇప్పుడే. 546 00:28:56,320 --> 00:28:58,238 నువ్వు ఎంత దారుణమైన వ్యక్తివో తెలుసా? 547 00:28:59,865 --> 00:29:00,866 తెలుసు. 548 00:29:06,121 --> 00:29:08,624 సరే. ఎవరైనా అడిగితే మాత్రం నువ్వు వారం క్రితమే నన్ను ఆహ్వానించావని, 549 00:29:08,624 --> 00:29:11,585 నేను జాగ్రత్తగా ఆలోచించి ఒప్పుకున్నానని చెప్పాలి. 550 00:29:11,585 --> 00:29:12,669 సరే. 551 00:29:12,669 --> 00:29:15,380 ఐదు నిముషాలు. -అలాగే. 552 00:29:22,971 --> 00:29:24,306 నీలో ఇంకా మాయ తగ్గలేదురోయ్. 553 00:29:28,894 --> 00:29:30,938 {\an8}టియా లేర్డ్ 1980-2021 ప్రియమైన భార్య, అమ్మ, స్నేహితురాలు 554 00:29:31,522 --> 00:29:32,523 హే. 555 00:29:34,441 --> 00:29:35,442 సరే. 556 00:29:36,443 --> 00:29:39,780 ఆహా, ఎంత బాగున్నాయో. -అవునా? 557 00:29:39,780 --> 00:29:42,616 కిందటి ఏడాది పుట్టినరోజుకి చేసిన పిచ్చిపనికి పరిహారం చేసుకోవాలిగా? 558 00:29:42,616 --> 00:29:45,619 మనిద్దరికీ పెద్ద టీవీ నచ్చుతుందనే అనుకున్నాను. 559 00:29:45,619 --> 00:29:49,164 ఏమైతేనేం? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ. 560 00:30:12,271 --> 00:30:13,272 ఇది సరిచేస్తాను ఉండు. 561 00:30:13,939 --> 00:30:15,858 ఆలస్యంగా వచ్చాము. -లేదు, అంతా బాగుంటుంది. 562 00:30:15,858 --> 00:30:17,442 ఏం మాట్లాడాలో ఆలోచించావా? 563 00:30:18,777 --> 00:30:20,028 అప్పటికి ఏం తోస్తే అది మాట్లాడేస్తాను. 564 00:30:40,340 --> 00:30:42,259 మన్నించండి. -అలాగే. 565 00:30:43,677 --> 00:30:45,053 ఈ సీట్స్ ఎవరైనా తీసుకున్నారా? 566 00:30:46,722 --> 00:30:47,973 నాన్నా, ఇక్కడేం చేస్తున్నావు? 567 00:30:47,973 --> 00:30:49,850 వేగస్ లో మరీ ఉక్కపోస్తుంది. 568 00:30:50,601 --> 00:30:53,270 పైగా, నాలుగో క్లాస్ సంగీత నాటకాలంటే నాకు చాలా ఇష్టం. 569 00:30:54,813 --> 00:30:56,398 డేవ్. -పాల్. 570 00:31:06,992 --> 00:31:08,368 మీ మనవడు ఎవరు వీళ్ళలో? 571 00:31:08,368 --> 00:31:10,204 ఆ పెద్ద ఎలుక అనుకుంటా. 572 00:31:11,121 --> 00:31:13,457 అది ఏనుగు నాన్నా. -అది ఏనుగా? 573 00:31:13,457 --> 00:31:16,627 ఆ ఏనుగులా ఉన్న పెద్ద ఎలుక. -అందమైన ఏనుగు. 574 00:31:16,627 --> 00:31:18,212 అవును, వాడు అందగాడు. 575 00:31:18,212 --> 00:31:20,589 అడవీ, పారాహుషార్. 576 00:31:25,677 --> 00:31:26,970 నీకు ఆవిడంటే ఇష్టమని తెలుసు. 577 00:31:27,554 --> 00:31:28,847 తను నాతో రాలేదు. 578 00:32:13,392 --> 00:32:14,351 లేచావా? 579 00:32:14,351 --> 00:32:17,104 మంచిది. హాయ్. నీకొక పాట చూపించాలనుకుంటున్నాను. 580 00:32:17,104 --> 00:32:19,481 అబ్బో. పాటలు వినే పార్టీలు మళ్లీ మొదలైనట్టున్నాయే. 581 00:32:20,232 --> 00:32:22,609 ఇది విన్నావంటే మూడ్ ఇట్టే సరైపోతుంది. 582 00:32:22,609 --> 00:32:23,694 సరే. 583 00:32:31,785 --> 00:32:33,579 సరే. అర్థమవుతోంది. 584 00:32:40,586 --> 00:32:42,754 హాయిగా వింటున్నా, నా మూడ్ పాడుచేయకు. -సరే. అలాగే. 585 00:32:42,754 --> 00:32:43,839 సరే. థాంక్యూ. 586 00:32:45,132 --> 00:32:47,593 వేరేచోట ఆడటానికి వెళ్ళేటప్పుడు బస్ లో ఈ పాట వింటుంటాము. 587 00:32:47,593 --> 00:32:52,347 సమ్మర్ రెచ్చిపోతుంది ఇది వింటే. గేటరేడ్ సీసా తీసుకొని నెత్తిమీద కొట్టేసుకుంది. 588 00:32:52,347 --> 00:32:54,349 అబ్బా. సమ్మర్ ఎప్పుడూ అలాంటివే చేస్తుంది. 589 00:32:54,892 --> 00:32:56,101 అలాగే చేస్తుంది. -తనని అస్సలు మారద్దని చెప్పు. 590 00:33:12,242 --> 00:33:16,663 హే, మళ్లీ మీ ఆట ఎప్పుడు ఉంటుంది? -వచ్చే మంగళవారం అనుకుంటా. చూడాలి. 591 00:33:18,207 --> 00:33:19,708 శనివారం, జూన్ 25, 2022 అమ్మ పుట్టినరోజు 592 00:33:21,585 --> 00:33:22,586 అయ్యయ్యో. 593 00:33:24,713 --> 00:33:26,089 అమ్మ పుట్టినరోజుని మరచిపోయాము. 594 00:33:30,719 --> 00:33:31,803 లేదు, నేను... 595 00:33:35,432 --> 00:33:36,725 దేవుడా. 596 00:33:36,725 --> 00:33:38,644 నిన్న తన దగ్గరకి వెళ్దామని నువ్వు నన్ను అడిగావు. 597 00:33:39,853 --> 00:33:41,063 అవును. 598 00:33:42,481 --> 00:33:43,982 మనం మరచిపోలేదు. నేనే మరచిపోయాను. 599 00:33:43,982 --> 00:33:47,903 నేనే మరచిపోయాను. ఛ! ఛ! దేవుడా. నువ్వెందుకు చెప్పలేదు నాకు? 600 00:33:47,903 --> 00:33:50,864 నీకు తెలుసు, అయినా నువ్వే దూరంగా ఉండాలనుకున్నావేమో అనుకున్నాను. 601 00:33:50,864 --> 00:33:53,742 ఛ! ఛ! నేనెంత దుర్మార్గురాలిని. -కాదు. 602 00:33:53,742 --> 00:33:55,494 లేదు, బంగారం. -ఏమయ్యింది నాకు? 603 00:33:55,494 --> 00:33:57,079 అలా ఎలా మరచిపోయాను? మరచిపోయాను... 604 00:33:57,663 --> 00:33:59,122 అది పొరపాటు, అంతే. 605 00:34:00,374 --> 00:34:01,333 కన్నా, ఇలా చూడు. 606 00:34:03,293 --> 00:34:04,503 పర్వాలేదు. 607 00:34:05,087 --> 00:34:06,088 లేదు. 608 00:34:07,089 --> 00:34:08,297 ఆలీస్. 609 00:35:01,185 --> 00:35:03,187 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్